శ్రీమన్నారాయణుడిని తులసీదళాలతో పూజించినా శుభం, జయం చేకూరుతుంది. మేషం: కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. రావలసిన మొండి బాకీలు సైతం వసూలుకాగలవు. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. ఆలయాలను సందర్శిస్తారు. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఒత్తిడి అధికం. మీ హోదా నిలబెట్టుకోవటానికి ధనం బాగా వెచ్చిస్తారు. వృషభం: ఆర్థికలావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో గణనీయమైన పురోభివృద్ధి...