ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 అక్టోబరు 2019 (12:48 IST)

29-10-2019 మంగళవారం మీ రాశి ఫలితాలు- శ్రీ మన్నారాయణుడిని పూజించినట్లైతే? (video)

శ్రీ మన్నారాయణుడిని పూజించినట్లైతే శుభం, పురోభివృద్ధి కానవస్తుంది 
 
మేషం: మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఇష్టం లేకున్నా కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలి. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్ధిస్తారు. రాజకీయాల్లో వారికి ఒత్తిడి, సమస్యలు అధికం. అయినా తేలికగా పరిష్కరిస్తారు. స్త్రీలకు నరాలకు సంబంధించిన చికాకులు అధికం అవుతాయి. 
 
వృషభం: ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా వారికి పనిభారం, ఒత్తిడి అధికమవుతాయి. వ్యాపారాల్లో గట్టిపోటీ, ఆటంకాలు ఎదుర్కొంటారు. విద్యార్థులకు అత్యుత్సాహం ఇబ్బందులకు దారితీస్తుంది. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. 
 
మిథునం: ఆర్థికస్థితి కొంతమేరకు మెరుగుపడుతుంది. మీ జీవిత భాగస్వామితో సఖ్యత నెలకొంటుంది. స్త్రీల ప్రతిభకు గుర్తింపు, అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఓర్పు నేర్పులకు పరీక్షా సమయం. ఆత్మ విశ్వాసం రెట్టింపు అవుతుంది. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం వల్ల అస్వస్థతకు లోనవుతారు. 
 
కర్కాటకం: దైవ, సేవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. ఏసీ, ఇన్వెర్టర్, ఎలక్ట్రానిక్ రంగాల వారికి పురోభివృద్ధి. ఏజెన్సీలు, టెండర్లు చేజిక్కించుకుంటారు. స్త్రీలకు అలంకరణ, విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబీకులలతో ఉల్లాసంగా గడుపుతారు. 
 
సింహం: ప్లీడర్లకు తమ క్లయింట్‌ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. పాత రుణాలు తీరుస్తారు. నిరుద్యోగులకు ఆకస్మికంగా ఒక అవకాశం కలిసివస్తుంది. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.
 
కన్య: శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. రుణం తీర్చడంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి. మీరు చేసే పనులకు బంధువుల నుంచి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. 
 
తుల: ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తులకు మందలింపులతో పాటు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆకస్మికంగా ప్రయాణాలు విరమించుకుంటారు. మీతో సఖ్యతగా నటించి తప్పుదారి పట్టించేందుకు కొంతమంది యత్నిస్తారు. 
 
వృశ్చికం: ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ఎంతటి పనినైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. విద్యుత్ రంగాల వారికి పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. సోదరి, సోదరులతో అవగాహన కుదరదు. 
 
ధనుస్సు: అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయడం వల్ల మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. 
 
మకరం: స్త్రీలకు సంపాదనపట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు, క్రయ విక్రయాల లావాదేవీలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికమవుతాయి. మీరంటే అందరికీ గౌరవం ఏర్పడుతుంది. 
 
కుంభం:  రవాణా రంగాల వారికి ప్రయాణీకులతో సమస్యలు తలెత్తుతాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. వాహన చోదకులకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. 
 
మీనం: మీ శ్రీమతి ఆరోగ్య, ఆహార వ్యవహారాల్లో మెలకువ అవసరం. నిరుద్యోగులకు నిరుత్సాహం తప్పదు. సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి చూడాల్సి వస్తుంది. ధనం బాగా అందుటం వలన ఓ కొంతైనా నిల్వ చేయగలుగుతారు.