సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 1 నవంబరు 2019 (15:50 IST)

శ్రీవారి సేవా టిక్కెట్లు దొరుకుతున్నాయి, త్వరపడండి

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతినెలా మొదటివారంలో శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లకు విడుదల చేస్తుంది. ఫిబ్రవరి నెల కోటాను అందుబాటులోకి తెచ్చింది టిటిడి. వేల సంఖ్యలో ఆర్జిత సేవా టిక్కెట్లను భక్తుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం 69,512టిక్కెట్లు ఆన్లైన్‌లో దొరుకుతున్నాయి. 
 
ఆన్ లైన్ డిప్ విధానంలో అయితే 10,112 సేవా టిక్కెట్లు ఉన్నాయి. ఇందులో సుమారు సుప్రభాతం 7,322టిక్కెట్లు, అర్చన 120, తోమాల 120, అష్టదళ పాదపద్మారాదన 240, నిజపాద దర్సనం 2300 టిక్కెట్లు ఉన్నాయి. 
 
ఆన్లైన్‌లో జనరల్ కేటగిరీలో 59,400 సేవా టిక్కెట్లు ఉండగా వీటిలో విశేష పూజ 2000, కళ్యాణం 13,300, ఊంజల్ సేవ 4,200, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,700, వసంతోత్సవం 15,400, సహస్రదీపాలంకరణ సేవ 16,800 టిక్కెట్లు ఉన్నాయి.