మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

30-10-2019 బుధవారం రాశి ఫలితాలు, దంపతుల మధ్య?

బుధవారం పూట 12 రాశుల వారు గాయత్రి మాతను ఆరాధించినట్లైతే శుభం చేకూరుతుంది. 
 
మేషం: రాజకీయనాయకులు సభాసమావేశాల్లో పాల్గొంటారు. దంపతుల మధ్య కలహాలు, చికాకులు చోటుచేసుకుంటాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా వుంటాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. 
 
వృషభం: ఉద్యోగస్తులకు పై అధికారులతో సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలు ఏర్పడతాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. క్రీడ, కళారంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. 
 
మిథునం: బంధువులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు, పోటీ పరీక్ష ఫలితాలు నిరాశను కలిగిస్తాయి. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
 
కర్కాటకం: వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మీ మిత్రుల నుంచి ధనసహాయం లభిస్తుంది. విద్యార్థుల అత్యుత్సాహం ఇబ్బందులకు దారితీస్తుంది. కుటుంబీకుల నుంచి సహాయసహకారాలు లభిస్తాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి వస్తుంది.
 
సింహం: విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. మీ సంతానం మొండి వైఖరి వల్ల చికాకులు తప్పవు.
 
కన్య: వృత్తి వ్యాపారాల వారికి ఆటంకాలు తొలగిపోతాయి. స్త్రీల కారణంగా చిక్కుల్లో పడే ఆస్కారం వుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం వల్ల కాంట్రాక్టర్లు, బిల్డర్లకు కష్టనష్టాలు తప్పవు.
 
తుల: స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాల్లో మెళకువ అవసరం. వాహనం నిదానంగా నడపడం క్షేమదాయకం. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించేవారుండరని గమనించండి. విద్యార్థినుల్లో ఏకాగ్రత లోపం వల్ల ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
వృశ్చికం: కోర్టు వ్యవహారాల్లో మెళకువ వహించండి. దూర ప్రయాణాల్లో అసౌకర్యానికి గురవుతారు. గృహ మరమ్మతులు ఆశించినంత చురుకుగా సాగవు. కపటం లేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. ఖర్చులు పెరిగినా మీ అసరాలకు కావలసిన ధనం సర్దుబాటు అవుతుంది. 
 
ధనస్సు: చేతివృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ప్రతిఫలం ఆశించినంతగా వుండదు. బంధువులకు ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రాజకీయాల్లోని వారికి ఇబ్బందులు తప్పవు. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
మకరం : స్త్రీల ఆర్జన పట్ల ఆసక్తి, అవకాశం కలిసివస్తుంది. కంప్యూటర్, అకౌంట్స్ రంగాల వారికి చికాకులు తప్పవు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. పత్రికా సంస్థల్లోని వారికి పునః పరిశీలన ముఖ్యం.
 
కుంభం: ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందుతారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి. బాకీల వసూలులో ఓర్పు, లౌక్యం అవసరం. ఖర్చులు పెరగడంతో అదనపు ఆదాయ సంపాదన దిశగా మీ ఆలోచనలు వుంటాయి.
 
మీనం: స్త్రీల సహకారంతో మీ దీర్ఘకాలిక సమస్య ఒక కొలిక్కి వచ్చే అవకాశం వుంది. మిత్రుల ఆదరణ సంతోషం కలిగిస్తుంది. ఉపాధ్యాయుల శ్రమకు మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ప్రయాణాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ముఖ్యం.