సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

10-05-2020 ఆదివారం మీ రాశి ఫలితాలు

సూర్య నారాయణ పారాయణ చేసినా అన్నివిధాలా కలిసివస్తుంది. 
 
మేషం: కుటుంబీకులకు కలిసి ఆలయాలను సందర్శిస్తారు. విందులలో పరిమితి పాటించండి. మత్స్యకోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. విద్యార్థులు క్రీడా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాల్లో మెళకువ అవసరం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. 
 
వృషభం: కపటం లేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తారు. విందులు, వినోదాల్లో అతిగా వ్యవహరించడం వల్ల భంగపాటుకు గురికాకతప్పదు. వివాహ యత్నాల్లో సఫలీకృతులవుతారు. ధనం అధికంగా వెచ్చిస్తారు. 
 
మిథునం: విదేశీయానం కోసం చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. సోదరీ సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పాత రుణాలు తీర్చగలుగుతారు. స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. 
 
కర్కాటకం: రాజకీయ నాయకులకు ప్రయాణాల్లో మెళకువ అవసరం. లీజు, ఏజెన్సీలు, భాగస్వామిక ఒప్పందాలకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. నిరుద్యోగులకు తాత్కాలికంగా అవకాశాలు లభిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. 
 
సింహం: సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు కుటుంబ సౌఖ్యం, విందుభోజనం వంటి శుభపరిణామాలు ఉంటాయి. పత్రికా రంగం సిబ్బంది  పొరపాట్లు జరగకుండా తగుజాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు.
 
కన్య: వృత్తి, వ్యాపారాల్లో గణనీయమైన మార్పులుంటాయి. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. క్లిష్టమైన సమస్యలు తలెత్తినా సమర్థతతో ఎదుర్కొంటారు.
 
తుల: మీ ఉన్నతిని చాటుకోవటానికి ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆత్మీయులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. స్త్రీలు విదేశీ వస్తువుల పట్స ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. భాగస్వామిక ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం కార్యరూపం దాల్చుతుంది.
 
వృశ్చికం: చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ అవసరం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఉమ్మడి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులకు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. స్త్రీలకు బంధువర్గాలతో పట్టింపులు ఎదురవుతాయి. 
 
ధనస్సు: నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. వ్యాపారాల్లో ఆటంకాలు అధిగమనించి అనుభవం గడిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఖర్చులు, ఇతరత్రా అవసరాలు మీ రాబడికి మించడం వల్ల ఒకింత ఒడిదుడుకులు తప్పవు.
 
మకరం: గత కొంత కాలంగా అనుభవిస్తున్న చికాకులు తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది. ఖర్చులు అధికమైనా సంతృప్తి , ప్రయోజనం పొందుతారు. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. సంఘంలో మీ మాటకు గౌరవం, ఆమోదం లభిస్తాయి. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి.
 
కుంభం: ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. మీ సంతానం ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. రుణం ఏ కొంతైనా తీర్చుతారు. గృహంలో ఒక శుభకార్యం అనుకూలిస్తుంది. ఖర్చులు అధికంగా వుంటాయి. స్త్రీలకు ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలు, తీర్థయాత్రల్లో అసౌకర్యానికి గురవుతారు.
 
మీనం: ఆదాయానికి మించి ఖర్చులు అధికం. వృత్తిరీత్యా ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ప్రయత్నపూర్వకంగా సదవకాశాలు లభిస్తాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. నిర్మాణ పనుల్లో బిల్డర్లకు, కాంట్రాక్టర్లకు ఏకాగ్రత ముఖ్యం. దూర ప్రయాణాల్లో చికాకులు తప్పవు. దైవ కార్యాల్లో పాల్గొంటారు.