శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 9 మే 2020 (20:00 IST)

10-05-2020 నుంచి 16-05-2020 వరకు మీ వార రాశి ఫలితాలు- video.

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
సంతోషకరమైన వార్తలు వింటారు. కష్టం ఫలిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. ఇచ్చిన డబ్బు తిరిగి రాదని గ్రహించండి. సోమ, మంగళవారాల్లో పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ముఖ్యుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది.  వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. వివాదాలు సద్దుమణుగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వల్లో జాగ్రత్త. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2పాదాలు 
సంప్రదింపులతో తీరిక ఉండదు. గత తప్పిదాలు పునరావృత్తమయ్యే సూచనలున్నాయి. తప్పటడుగు వేసే ఆస్కారం వుంది. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. పెద్దల సలహా పాటించండి. పనులు సావకాశంగా పూర్తిచేస్తారు. ఆదాయం సంతృప్తికరం. బుధవారం నాడు ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది వుండదు. పొదుపు పథకాలు పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు యూనియన్‌‍లో గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. సమావేశాల్లో పాల్గొంటారు. 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
కొత్త సమస్యలెదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు ఏమంత స్పందన వుండదు. ఏది జరిగినా మంచికేనని భావించండి. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. గురు, శుక్రవారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కుటుంబీకులు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. వైద్య, న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. పత్రాల రెన్యువల్‌లో నిర్లక్ష్యం తగదు. వాహన చోదకులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి.  
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
సమర్థతను చాటుకుంటారు. మీ పట్టుదల ఎదుటివారికి స్ఫూరినిస్తుంది. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ధనలాభం, దాంపత్య సౌఖ్యం పొందుతారు. శని, ఆదివారాల్లో పనులు సాగక విసుగు చెందుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆశ్చర్యకరమైన సంఘటనలెదురవుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. సన్నిహితులకు ముఖ్య సమాచారం అందిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వాహనం ఇతరులకు ఇవ్వవద్దు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఆదాయం సంతృప్తికరం. రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. ఆత్మీయులను కలుసుకుంటారు. వ్యవహారానుకూలత ఉంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పత్రాలు అందుతాయి. బాధ్యతలు స్వీకరిస్తారు. సోమ, మంగళవారాల్లో అపరిచితులతో జాగ్రత్త. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆందోళన కలిగించే సంఘటనలెదురవుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. సంతానం దూకుడు అదుపుచేయండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. అధికారులకు హోదా మార్పు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ప్రయాణం తలపెడతారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
ఆర్థికస్థితి నిరాశాజనకం. పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. అవకాశాలు చేజారిపోతాయి. మనోధైర్యంతో ముందుకు సాగండి. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. అవసరాలకు అతికష్టంమీద ధనం సర్దుబాటు అవుతుంది. పనుల్లో ఒత్తిడి, ఆటంకాలెదుర్కుంటారు. మీ శ్రీమతి వైఖరి చికాకు కలిగిస్తుంది. గృహమార్పు ఏమంత ఫలితం ఇవ్వదు. మీపై శకునాల ప్రభావం అధికం. బుధవారం నాడు బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆప్తుల సలహా పాటించండి. నోటీసులు అందుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. అధికారులకు పనిభారం. విశ్రాంతి లోపం. రిటైర్డ్ ఉద్యోగులకు వీడ్కోలు పలుకుతారు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
శ్రమాధిక్యత మినహా ఫలితం వుండదు. నిస్తేజానికి లోనవుతారు. విమర్శలు ఆగ్రహం కలిగిస్తాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఖర్చులు విపరీతం. సన్నిహితుల సాయం అందుతుంది. గురు, శుక్రవారాల్లో అకాల భోజనం, విశ్రాంతి లోపం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన వుండదు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ధనలాభం వుంది. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. ఆప్తులకు సాయం అందిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. శనివారం నాడు బ్యాంకు పనుల్లో చికాకులు అధికం. పదవులు దక్కవు. పట్టుదలతో వ్యవహరించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఒక వ్యవహారంలో మీ ప్రమేయం అనివార్యం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. 
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. మీ శ్రమ వృధా కాదు. ఖర్చులు అధికం. సంతృప్తికరం. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఆది, సోమవారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. వాగ్వాదాలకు దిగవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. పెట్టుబడులకు తరుణం కాదు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశాల్లోని ఆప్తుల క్షేమం తెలుసుకుంటారు. 
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. బుధవారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. దూరాన వున్న సంతానం క్షేమం ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ధనయోగం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
విమర్శలు, అభియోగాలు ఎదుర్కొంటారు. చిన్న విషయమే సమస్యాత్మకమవుతుంది. వాగ్వాదాలకు దిగవద్దు. స్థిమితంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఆత్మీయుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. దుబారా ఖర్చులు అధికం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. విద్యా ప్రకటనలను విశ్వసించవద్దు. విద్యార్థులకు ఒత్తిడి అధికం. కొత్త పరిచయాలేర్పడతాయి. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు హోదామార్పు, వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వృత్తుల వారికి సామాన్యం. ప్రయాణంలో అవస్థలెదుర్కొంటారు. 
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఈ వారం అనుకూలదాయకమే. మాటతీరు ఆకట్టుకుంటుంది. సమస్యలను ధీటుగా ఎదుర్కొంటారు. ధనలాభం వుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. దాంపత్యసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. సంతానం దూకుడు అదుపుచేయండి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. వృత్తుల వారికి ఆశాజనకం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.