శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2020 (20:05 IST)

12 రాశుల వారు పూజించాల్సిన వినాయకుడు...

12 రాశుల వారు వారి రాశికి అనుగుణంగా వినాయకుడిని పూజిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. రాశికి అనుగుణంగా విఘ్నాలను తొలగించే వినాయకుడిని పూజించడం చేస్తే కార్యసిద్ధి చేకూరుతుంది. ఈ క్రమంలో మేష రాశి వారు.. వీర గణపతిని పూజించాలి. మనోధైర్యం కలిగివుండే మేషరాశి జాతకులు.. అంగారకుని ఆధిక్యం కలిగివుంటారు. 
 
ఇక వృషభ రాశి జాతకులు శుక్రుని ఆధిపత్యం కలిగివుంటారు. అందుచేత వీరు రాజరాజేశ్వరి అంశంగా భావించే శ్రీ విద్యా గణపతిని పూజించాలి. అలాగే మిథున రాశి జాతకులు లక్ష్మీ గణపతిని పూజించాలి. కర్కాటక రాశికి చెందిన జాతకులు హేరంబ గణపతిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. సింహరాశి వారు.. విజయగణపతిని, కన్యారాశి జాతకులు మోహన గణపతిని పూజించడం ద్వారా మంచి ఫలితాలుంటాయి.
 
తులారాశి జాతకులు విజయ గణపతిని, వృశ్చిక రాశి వారు.. శక్తి గణపతిని, ధనుస్సు రాశివారు.. సంకష్టహర గణపతిని పూజించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మకరరాశి జాతకులు యోగ గణపతిని స్తుతించాలి. కుంభరాశి వారు.. సిద్ధిగణపతిని.. మీనరాశి జాతకులు.. బాల గణపతిని పూజించడం ద్వారా సకల అభీష్టాలు సిద్ధిస్తాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.