బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేవకపోతే.. ఏమౌతుందో తెలుసా?

Lights
సెల్వి| Last Updated: శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (14:09 IST)
Lights
బ్రహ్మ ముహూర్త కాలంలో దీపాలను వెలిగించడం ద్వారా ఏర్పడే ఫలితాలను ఓసారి పరిశీలిద్దాం.. బ్రహ్మ ముహూర్తకాలంలో దీపం వెలిగించి పూజ చేయడం ద్వారా అప్పుల బాధ అంటూ వుండదు. కార్య విఘ్నాలు తొలగిపోతాయి. ఈతిబాధలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు వుండవు. బ్రహ్మ ముహూర్త కాలం అంటే ఉదయం 3.30 గంటల నుంచి ఆరు గంటల వరకు. ఆ సమయంలో నిద్రలేచి, స్నానమాచరించి.. పూజ చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

ఇంకా ఆ సమయంలో విద్యార్థులు చదవడం ద్వారా జ్ఞానం పెరుగుతుంది. బ్రహ్మ ముహూర్త సమయంలో దేవతలు, పితృదేవతలు మన ఇంటికి వస్తారని విశ్వాసం. ఆ సమయంలో వారిని స్వాగతించకుండా నిద్రపోవడం ద్వారా వారు మన ఇంట వసించరని చెప్తుంటారు. అందుకే రోజు బ్రహ్మ ముహూర్తకాలంలో నిద్రలేచి.. స్నానమాచరించి విభూతిని నుదుట ధరించి.. భగవంతుడిని స్మరిస్తే.. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇంకా సూర్యోదయానికి ముందే నిద్రలేవడం ద్వారా సూర్య నమస్కారం కూడా చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.

బ్రహ్మముహూర్తంలో బియ్యం పిండితో వాకిట్లో ముగ్గు వేయడం అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. అలాగే సాయంత్రం సూర్యాస్తమయానికి ముందే దీపారాధన చేయడం మంచిది. బ్రహ్మముహూర్తంలో శివ పంచాక్షరీతో ప్రార్థన చేయొచ్చు. దీంతో గృహంలో పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. ఈతిబాధలు తొలగిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యం పెంపొందుతుందని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :