గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 మార్చి 2020 (17:47 IST)

కలలో గులాబీ పువ్వులు, దీపాలు, పూజ చేస్తున్నట్లు కనిపిస్తే?

కలలో పూజ చేస్తున్నట్లు, దీపాలు వెలిగిస్తున్నట్లు వస్తే శుభసూచకమేనని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. కొంతమందికి తాము పూజ చేస్తున్నట్టుగా కల రావడం శుభ సూచకమేనని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. తాము పూజ చేస్తున్నట్టుగా కల రావడం వలన, కష్టాలు తొలగిపోయి సుఖసంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని చెప్పబడుతోంది. 
 
కాబట్టి ఎప్పుడైనా తాము పూజ చేస్తున్నట్టుగా కల వస్తే, ఇక దాని గురించిన ఆలోచనలతో సతమతం కాకుండా ఆనందంగా ఉండొచ్చు. అలాగే దీపం వెలిగించడం ఎంతటి శుభప్రదమో... కలలో దీపం కనిపించడం కూడా అంతే మంచిదని చెప్పబడుతోంది. 
 
దీపం లక్ష్మీదేవి స్వరూపం ... సమస్త శుభకార్యాలు దీపం వెలిగించడంతోనే ఆరంభమవుతాయి. సకల దోషాలు దీపం వెలిగించడంతోనే తొలగిపోతాయి. అలాంటి దీపం కలలో కనిపించడాన్ని శుభపరిణామాలకు సంకేతంగా భావించవచ్చు. 
 
ముఖ్యంగా కలలో గులాబీ పువ్వులు కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభించినట్లేనని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. లక్ష్మీదేవికి గులాబీ పూలు ఎంతో ప్రీతికరమైనవి. ఈ కారణంగానే శ్రావణ మాసంలో 'వరలక్ష్మీ వ్రతం' రోజున కూడా అమ్మవారిని గులాబీ పూలతో పూజిస్తూ వుంటారు. 
 
లక్ష్మీదేవిని గులాబీలతో అర్చించడం వలన ఆ తల్లి వెంటనే సంతృప్తిచెంది అనుగ్రహిస్తుంది. అంతగా అమ్మవారి మనసు గెలుచుకునే గులాబీలు కలలో కనిపించడం, లక్ష్మీదేవి రాకకు సంకేతంగా చెప్పబడుతోంది. అందువలన కలలో గులాబీలు కనిపించడం శుభ సంకేతంగా భావించాలని స్పష్టం చేస్తున్నారు.. ఆధ్యాత్మిక పండితులు.