సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 14 మార్చి 2020 (21:36 IST)

కుజ దోషం, శని దోషం వున్నవారు ఇలా చేస్తే...

హనుమంతుడిని పూజించడం ద్వారా గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. కుజదోషం ఉన్నవారు మంగళవారం పూట, శనిదోషం ఉన్నవారు శనివారం రోజున స్వామిని పూజించడం వల్ల ఆశించిన ఫలితం లభిస్తుంది. 
 
కోరిక కోరికలను నెరవేర్చే హనుమంతుడిని రెండు రోజుల్లో పూజించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఈ రెండు రోజుల్లో భక్తులు హనుమంతుడికి భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు చేయాలి. అలాగే తమలపాకుతో అర్చిస్తే, ఇక హనుమంతుడికి సంతోషాన్ని కలిగించే సింధూరాభిషేకం జరిపించే వాళ్లు కూడా ఎక్కువగానే వుంటారు. స్వామికి అప్పాలు, వడలు అంటే ఎంతో ఇష్టమని తెలిపింది. అందువలన ఆలయాల్లో వాటిని నైవేద్యంగా సమర్పిస్తుంటారు.
 
మంగళ, శనివారాల్లో అప్పాలను గానీ, వడలను గాని చేయించి స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం వలన ఆయన ప్రీతి చెందుతాడని అంటారు. హనుమంతుడి అనుగ్రహముంటే, ఆయురారోగ్యాలతో జీవితం ఆనందంగా సాగిపోతుందని విశ్వసిస్తుంటారు.