గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 మార్చి 2020 (18:34 IST)

బిల్వపత్రాలతో శివపూజ, శివార్చన చేస్తే?

బిల్వపత్రాలతో శివపూజ, శివార్చన చేసేవారికి మరుజన్మంటూ వుండదు. పూర్వ జన్మల పాపాలు హరించుకుపోతాయి. శివుని శక్తితో భూమిపై అవతరించిన వృక్షమే బిల్వం. ఈ వృక్షం శివాలయాల్లో స్థల వృక్షంగా వుంటుంది. ఈ వృక్షాన్ని పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. బిల్వ పత్రాలు త్రిశూల ఆకారంలో వుంటాయి. ఇవి శివుని ముక్కంటిని కూడా సూచిస్తాయి. 
 
బిల్వంలో మహా బిల్వం, కర్పూర బిల్వం, సిద్ధ బిల్వం అనే రకాలున్నాయి. అందులో ముఖ్యంగా మూడు పత్రాలతో కూడిన బిల్వ పత్రాలు పూజకు శ్రేష్టమైనవి. బిల్వ పత్రాల్లో ఏడు, ఐదు పత్రాల్లోనూ వున్నాయి. పూజకు ఉపయోగించే బిల్వ పత్రాలను సూర్యోదయానికి ముందుగానే వృక్షం నుంచి తీసుకోవడం చేయాలి. కొన్ని నీళ్లను బిల్వ పత్రాలపై చల్లిన తర్వాత పూజకు ఉపయోగించాలి. 
 
రోజూ బిల్వ పత్రాలను శివునికి సమర్పించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇంకా మహాశివరాత్రి రోజున అర్థరాత్రి బిల్వాష్టకం పారాయణం చేసి.. బిల్వార్చన చేస్తే మరుజన్మంటూ వుండదు. బిల్వ పత్రాల పూజతో ఏడేడు జన్మల పాపాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.