శుక్రవారం, 31 అక్టోబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 అక్టోబరు 2025 (17:36 IST)

Pushpayagam : అక్టోబర్ 30న తిరుమలలో పుష్పయాగం

Pushpayagam in Tirumala
Pushpayagam in Tirumala
తిరుమలలో వార్షిక పుష్పయాగం అక్టోబర్ 30న జరుగనుంది. ఇందుకు ముందుగా అక్టోబర్ 29న అంకురార్పణంతో ప్రారంభం అవుతుంది. బుధవారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు వసంత మండపంలో మృత్సంగ్రహణం, ఆస్థానం, ఇతర మతపరమైన కార్యక్రమాలతో అంకురార్పణం జరుగుతుంది.
 
గురువారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం, తరువాత అక్టోబర్ 30న మధ్యాహ్నం 1 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగం జరుగుతుంది. 
 
ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవ దేవతలను కల్యాణోత్సవ మండపంలో ప్రత్యేక వేదికపై ఆసీనులను చేస్తారు. ఈ శుభ సందర్భంగా వివిధ రకాల సుగంధ, సాంప్రదాయ, అలంకార పుష్పాలతో పుష్ప యాగం చేస్తారు.

ఉత్సవాల కారణంగా అక్టోబర్ 29న సహస్ర దీపాలకర సేవను, అక్టోబర్ 30న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలను టిటిడి రద్దు చేసింది.