శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

05-05-2020 మంగళవారం దినఫలాలు - శివుడికి అభిషేకం చేస్తే...

మేషం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. స్త్రీల ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు పెరగడ వల్ల పనిభారం తప్పదు క్రయ విక్రయాలు సంతృప్తికరంగా సాగుతాయి. 
 
వృషభం : బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా మెలగడం మంచిది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాటిగా ఉంటాయి. గృహ నిర్మాణాలు చేపడతారు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. దైవ కార్యక్రమాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. 
 
మిథునం : ఆర్థిక విషయాలలో ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తారు. చిన్నతరహా పరిశ్రమల వారికి సంతృప్తి కానరాదు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కొబ్బరి, పండ్లు, పానీయ వ్యాపారులకు లాభదాకయంగా ఉంటుంది. అపరాలు, ధాన్యం, వాణిజ్యం వ్యాపారులకు సంతృప్తి. పురోభివృద్ధి కానవస్తుంది. 
 
కర్కాటకం : వృత్తుల వారు ఎంత శ్రమించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రేమికుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. కొబ్బరి, పండ్లు, కూరగాయల వ్యాపారులకు కలిసివచ్చే కాలం. ఆస్తి వ్యవహారాలలో సోదరీ, సోదరుల వైఖరి ఆందోళన కలిగిస్తుంది. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించేవారుండరు. 
 
సింహం : మీ శ్రీమతి వ్యాఖ్యలు మీపై బాగా ప్రభావం చూపుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం గురించి ఆదోళన చెందుతారు. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. ఖాదీ, చేనేత, నూలు వస్త్ర వ్యాపారులకు పురోభివృద్ధి. సోదరీ, సోదరుల వైఖరి ఆందోళన కలిగిస్తుంది. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించేవారుండరు. 
 
సింహం : మీ శ్రీమతి వ్యాఖ్యలు మీపై బాగా ప్రభావం చూపుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. ఖాదీ, చేనేత, నూలు వస్త్ర వ్యాపారులకు పురోభివృద్ధి మీ విషయాల్లో ఇతర జోక్యానికి తావివ్వడం మంచిదికాదని గమనించండి. 
 
కన్య : వ్యాపారాల్లో పెరిగిన పోటీ వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. ఆకస్మికంగా బిల్లుల వాయిదాపడతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్రతి విషయంలోనూ స్వయం కృషిపైనే ఆధారపడటం మంచిది. ఆశించిన ఆదాయం అందకపోవడం వల్ల ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. 
 
తుల : లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. దైవ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక స్థితిలో ఏమాత్రం పురోభివృద్ధి ఉండదు. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆందోళన తప్పదు. 
 
వృశ్చికం : దంపతుల మధ్య కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. భాగస్వామిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్, బదిలీలకు కొంతమంది అవరోధం కల్పిస్తారు. బలహీనతలు గోప్యంగా ఉంచండి. 
 
ధనస్సు : స్త్రీల మాటకు వ్యతిరేకత ఎదురవుతుంది. మీ అలవాట్లు, బలహీనతలు గోప్యంగా ఉంచడం శ్రేయస్కరం. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. హోటల్, క్యాటరింగ్ పనివారలకు, చిరు వ్యాపారులకు అనుకూలం. విద్యార్థినిలకు ప్రేమ వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులు తప్పవు. 
 
మకరం : శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులకై చేయు యత్నాలు అనుకూలించగలవు. నూతన పరిచయాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. 
 
కుంభం : కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు అన్ని విధాలా కలిసిరాగలదు. స్త్రీలకు బంధువుల నుంచి మొహమ్మాటం, ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయక సత్‌కాలంను సద్వినియోగం చేసుకోండి. స్త్రీలు, టీవీ చానెల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. ఆపద సమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు. 
 
మీనం : స్త్రీలు అపరిచిత వ్యక్తుల పట్ల మోసపోయే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులు హోదా పెరిగే ఆస్కారం ఉంది. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆదాయంలో చక్కని అభివృద్ధి కలసివస్తుంది. ప్రముఖుల ప్రమేయంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి.