మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

03-05-2020 ఆదివారం దినఫలాలు -ఆదిత్యుడిని ఆరాధించినా శుభం

మేషం : ఆలయ సందర్శనాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీలకు చీటికిమాటికి అసహనం చికాకులు అధికమవుతాయి. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనులలో పనివారలతో చికాకులు తప్పవు. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. 
 
వృషభం : వ్యాపారాభివృద్ధికి పలు ప్రణాళికలు, పథకాలు అమలుచ చేస్తారు. మిత్రులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. విద్యార్థినిలు ప్రేమ వ్యవహారాల్లో అతిగా వ్యవహరించడం వల్ల భంగపాటు తప్పదు. 
 
మిథునం : బృంద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. గత అనుభవంతో వర్తమానంలో ఒక సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. 
 
కర్కాటకం : మీలో రూపుదిద్దుకున్న ఆలోచనలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. స్త్రీలకు షాపింగ్‍ వ్యవహారాల్లో మెళకువ అవసరం. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. వృత్తులలో వారికి చిన్నతరహా పరిశ్రమలలో వారికి చికాకులు తప్పవు. ప్రేమికులకు, పెద్దలకు మధ్య సమస్యలు ఎదురవుతాయి. 
 
సింహం : మీ సహచరుల అభిప్రాయాలు వినడం వల్ల కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. కొన్ని విషయాలలో పెద్దల సలహాలు తీసుకోవడం చాలా ఉత్తమం. రావలసిన బకాయిలు ముందు వెనుకలుగానైనా అందటం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. 
 
కన్య : ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. బంధువుల రాకతో ఖర్చులు అధికవుతాయి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రయాణాలలో వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు. 
 
తుల : కుటుంబీకులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఇంటికి చిన్నచిన్న మరమ్మతులు చేయించే అవకాశం ఉంది. చేపట్టిన పనులు వాయిదాపడతాయి. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి వల్ల ఆందోళనలకు గురవుతారు. ప్రయాణాలలో అసౌకర్యానికి లోనవుతారు. తలపెట్టిన పనులు ఆశించనంత చురుకుగా సాగవు. 
 
వృశ్చికం : మీ అభిలాష నెరవేరే సమయం ఆసన్నమైందని గమనించండి. ఏ విషయంలోనూ ఇతరులపై ఆధారపడక స్వయంకృషినే నమ్ముకోవడం మంచిది. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్యమైన ఫలితాలను ఇస్తుంది. పాత మిత్రుల కలయికలతో మానసికంగా కుదుటపడతారు. 
 
ధనస్సు : వృత్తులవారికి సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువులపై మక్కువ పెరుగుతుంది. ఎప్పటి నుంచో ఎదురయ్యే సమయం ఆసన్నమైనదని గమనించండి. దైవ దర్శనాల వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. రావలసిన ధనం చేతికందటంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు. 
 
మకరం : కార్యసాధనలో ఓర్పు, నేర్పు, పట్టుదల అవసరం. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నాలు సాగించండి. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయం మీ ఉన్నతికి సహకరిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. 
 
కుంభం : పెద్దల ఆశీస్సులు, బంధువుల ప్రశంసలు పొందుతారు. దుబారా ఖర్చులు అధికం కావడం వల్ల ధనం ఏమాత్రం నిల్వ చేయలేకపోతారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు సమసిపోతాయి. ఫ్యాన్సీ, స్టేషనరీ, రసాయన, సుగంధద్రవ్య వ్యాపారులకు శుభదాయకం. ప్రయాణాలలో చిన్నచిన్న ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
మీనం : వృత్తుల వారికి అవకాశాలు, ప్రజా సంబంధాలు విస్తరిస్తాయి. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికం. పత్రికా సిబ్బందికి ఏకాగ్రత ప్రధానం. రాబోయే ఖర్చులను తలచుకుని ఆందోళన చెందుతారు. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.