మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

29-04-2020 బుధవారం దినఫలాలు : సత్యదేవుని పూజిస్తే...

మేషం : బ్యాంకింగ్ రంగాల వారు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. సంతానం భవిష్యత్ కోసం పొదుపు పథకాలపై దృష్టిసారిస్తారు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉడటం శ్రేయస్కరం. వివాహ సంబంధమై దూర ప్రాంతాలకు ప్రయాణం చేయలవలసి వస్తుంది. 
 
వృషభం : రెట్టించిన ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. కళత్ర పట్టుదల, సంతానం మొండి వైఖరి వల్ల చికాకులు తప్పవు. రెట్టించిన ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఇతరుల గురించి, హాస్యానికై మీరు చేసిన వ్యాఖ్యానాల వల్ల ఊహించని సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. 
 
మిథునం : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. రిప్రజెంటేటివ్‌లు, పత్రికా రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. పెద్దల ఆరోగ్యం కోసం ధనం విరివిగా వ్యయమవుతుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందుల ఎదుర్కొంటారు. 
 
కర్కాటకం : టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. కొంత మొత్తం సాయం చేసి వారిని సంతృప్తిపరచండి. స్త్రీలకు అనురాగ వాత్సల్యాలు పెంపొదుతాయి. ప్రైవేటు సంస్థలలోని వారు ఓర్పు, అంకితభావంతో పనిచేసినగాని నిలదొక్కుకోలేరు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. 
 
సింహం : బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ వహించండి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. ఉమ్మడి వ్యాపారాల విషయంలో పునరాలోచన అవసరం. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. విదేశీ చదువులకై చేయు ప్రయత్నాలలో విజయం. 
 
కన్య : కళాకారులకు, రచయితలకు, పత్రికా రంగంలోనివారికి అనుకూలమైన కాలం. సాంఘీక, దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. నూతన వ్యాపారాలు, వృత్తుల ఉపాధి పథకాల్లో నిలదొక్కుకోవడానికి కష్టపడాలి. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి.
 
తుల : మీ శ్రీమతి సలహా పాటించండం చిన్నతంగా భావించకండి. ఆలయాలను సందర్శిస్తారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. సంతానంపై చదువుల కోసం భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. 
 
వృశ్చికం : అంతగా పరిచయం లేని వారికి ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం. ఇంటా బయట సమస్యలు తలెత్తినా తెలివితేటలతో పరిష్కరించగలుగుతారు. సంతానంపై చదువుల కోసం భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
ధనస్సు : ఉపాధ్యాయులకు, మార్కెటింగ్, రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. వైద్య, న్యాయ రంగాల వారికి ఏకాగ్రత ప్రధానం. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. రాజకీయాలలో వారికి అభిమాన బృందాలు అధికమవుతాయి. స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. 
 
మకరం : అలౌకిక విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. దూర ప్రయాణాలు మీకు అనుకూలించగలవు. ముఖ్యుల నుండి ధన సహాయం లభించడంతో ఒకడుగు ముందుకు వేస్తారు. బధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. వ్యవసాయ, తోటల రంగాలలో వారికి ఊహించని మార్పులు సంభవిస్తాయి. 
 
కుంభం : ప్రభుత్వ సంస్థల్లో వారికి ఆశించినంత గుర్తింపు లభించదు. హామీలు, ఇతరులకు ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన చాలా అవసరం. ఉద్యోగస్తులకు పై అధికారుల తోడ్పాటు లభిస్తుంది. దైవ, పుణ్యకార్యాలకు విరివిగా ధనం వ్యయం చేస్తారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు ప్రగతి పథంలో నడుస్తాయి. 
 
మీనం : కుటుంబంలో నెలకొన్న అనిశ్చితలు, అశాంతి క్రమంగా తొలగిపోగలవు. ఆత్మీయులను విస్మరించుట వల్ల సమస్యలు తలెత్తుతాయి. బంధువుల రాకతో ఆకస్మిక ఖర్చులు అధికమవుతాయి. ఓర్పు, నేర్పుతో విజయాన్ని సాధించగలరు. మిత్రులతో సంభాషించటం వల్ల మీలో మానసిక ధైర్యం, కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటాయి.