మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

26-04-2020 ఆదివారం దినఫలాలు - ఆదిత్య హృదయం చదివితే...

మేషం : మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఆత్మీయులతో శుభకార్యాలు, వేడుకల్లో పాల్గొంటారు. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ఫలితం ఉండదు. నిరుద్యోగులు, వృత్తుల వారికి సామాన్యం. అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆకస్మికంగా ఖర్చులెదురైనా ఇబ్బందులంతగా ఉండవు. 
 
వృషభం : స్టాక్ మార్కెట్ రంగాల వారికి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సన్నిహితుల  సహకారం లభిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో గణనీయమైన పురోగతి ఉంటుంది. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి కుటుంబీకులతో ఒక అవగాహనకు వస్తారు. 
 
మిథునం : విద్యార్థినుల్లో ధ్యేయం పట్ల ఏకాగ్రత, స్థిరతవం నెలకొంటాయి. రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. గత తప్పిదాలు పునరావృతంకాకుండా జాగ్రత్త వహించండి. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధిపథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
కర్కాకటం : మీ ఉన్నతిని చాటుకోవడానికి ధనం విరివిగా వ్యయం చేయాల్సి ఉంటుంది. గృహ మార్పులు, మరమ్మతులు చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. కార్యసాధనలో స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. కొబ్బరి, పండ్లు, పూల, పానీయ వ్యాపారులకు శుభదాకయం. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
సింహం : స్త్రీలకు రచనలు సమాజసేవ పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ధనవ్యయం విషయంలో మితంగా వ్యవహరించండి. క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతాయి. పత్రికా రంగంలో వారికి ఏకాగ్రత ముఖ్యం. 
 
కన్య : ప్రింటింగ్ రంగాల వారికి అక్షర దోషం వల్ల చికాకులు తప్పవు. సేవా, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూత వెంచర్లు అనుకూలిస్తాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
తుల : మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఇతరుల విషయాలు, వాదోపవాదాలు దూరంగా ఉండటం శ్రేయస్కరం. రుణయత్నాల్లో అనుకూలతలుంటాయి. బంధు మిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాభివృద్ధికి అమలు చేసిన పథకాలు మంచి ఫలితాలనిస్తాయి. 
 
వృశ్చికం : రాజకీయ నాయకులకు పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ వుండదు. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు, ఇతరాత్రా చికాకులు అధికంగా ఉంటాయి. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. 
 
ధనస్సు : ఆర్థిక విషయాలలో స్వల్ప ఒడిదుడుకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. మత్స్య కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకం. వాతావరణంలో మార్పు వల్ల వ్యవసాయ, తోటల రంగంలో వారికి ఆందోళనలు ఎదుర్కొంటారు. విద్యార్థులు క్రీడా రంగాల పట్ల ఆసక్తి చూపుతారు. స్త్రీలు షాపింగులో దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. 
 
మకరం : రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. కుటుంబీకులతో కలిసి విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటరు. మీ బలహీనతలు, అలవాట్లు ఇబ్బందులకు దారితీస్తాయి. 
 
కుంభం : రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కొత్తవెంచర్ల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దూరప్రయాణాలలో వస్తువులు పట్ల మెళకువ అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. బంధు మిత్రుల రాకపోకలు అధికమవుతాయి. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ధనం విపరీతంగా వ్యయం అయినా ప్రయోజనకరంగా ఉంటుంది. 
 
మీనం : వస్త్ర వ్యాపారులకు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. కోపంతో పనులు చక్కబెట్టలేరు. స్పెక్యులేషన్ రంగాల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.