శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

28-04-2020 మంగళవారం దినఫలాలు - కార్తికేయుడిని పూజిస్తే జయం

మేషం : ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువును దక్కించుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. బంధువుల రాక వల్ల ఖర్చులు అధికమవుతాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. 
 
వృషభం : హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు విశ్రాంతికైచేయు యత్నాలు అనుకూలిస్తాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. ఇతరులను అతిగా విశ్వసించం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త వహించండి. 
 
మిథునం : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. బంధువుల కోసం అధికంగా ధనం వ్యయం చేస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. రాజకీయాల వారు కార్యకర్తల వల్ల సమస్యలు ఎదుర్కొనక తప్పదు. కుటుంబీకులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. 
 
కర్కాటకం : భాగస్వామి చర్చల్లో మీ ప్రతిపాదనలకు మిశ్రమ స్పందన ఎదురవుతుంది. బంగారం, వెండి, వస్త్ర, ఆభరణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలు దైవ కార్యక్రమాలలో అందరినీ ఆకట్టుకుంటారు. మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతారు. రాజకీయాల వారికి రహస్యపు విరోధులు అధికవుతున్నారని గమనించండి. 
 
సింహం : ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధికమిస్తారు. రాజకీయ నాయకులు తరచూ సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. బంధువులతో గృహంలో సందడి కానవస్తుంది. ఊహించని ఖర్చు వల్ల చేబదుళ్లు తప్పవు. కాంట్రాక్టర్లకు ప్రముఖుల సహకారంతో పెద్దపెద్ద కాంట్రాక్టులు దక్కించుకుంటారు. 
 
కన్య : కుటుంబీకులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతరు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. బంధువులను కలుసుకుంటారు. 
 
తుల : ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. గృహమునకు కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రముఖుల కలయిక సాధ్యపడదు.
 
వృశ్చికం : ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. సాహస ప్రయత్నాలు విరమించండి. విందు, వినోదాలలో పరిమితి పాటించడం శ్రేయస్కరం. గృహోపకరణ వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. బంధువులరాక వల్ల పనులు వాయిదాపడతాయి. 
 
ధనస్సు : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇతరాత్రా చికాకులు అధికమవుతాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. 
 
మకరం : రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో మెళకువ అవసరం. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక  సమయం వేచి ఉండాల్సి వస్తుంది. స్త్రీలకు విశ్రాంతి లోపం, వేళతప్పి భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. 
 
కుంభం : రుణాల కోసం అన్వేషిస్తారు. బంధు మిత్రులలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. 
 
మీనం : స్త్రీలు షాపింగ్‌లో దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. కోపంతో పనులు చక్కబెట్టలేరు. రవాణా రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. విద్యార్థులు క్రీడా రంగాలపట్ల ఆసక్తి చూపుతారు.