సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

09-05-2020 శనివారం దినఫలాలు - శ్రీమన్నారయణ స్వామిని ఆరాధిస్తే...

మేషం : వస్త్ర, బంగారం, వెండి ఫ్యాన్సీ రంగాల్లో వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వం నుంచి అభ్యంతరాలెదురవుతాయి. మీ ఆంతరంగిక సమస్యలకు పరిష్కారం కానరాదు. రావలసిన ధనం వసూలులో కొంత మేరకు చేతికందుతుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. 
 
వృషభం : వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి మెళకువ అవసరం. లిటిగేషన్ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. పత్రికా రంగంలోని వారికి కళాకారులకు రచయితలకు అనువైన సమయం. బంధుమిత్రుల రాకపోకలు అధికం. మందులు, ఎరువులు, రసాయన, ఫ్యాన్సీ సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు. 
 
మిథునం : సిమెంట్, ఐరన్, కలప, ఇటుక వ్యాపారస్తులకు సామాన్యం. ఉమ్మడి వ్యాపారాల వల్ల ఏకాగ్రత అవసరం. కార్యసిద్ధికి ఓర్పు, పట్టుదలతో శ్రమించవలసి ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
కర్కాటకం : వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. దైనందిన కార్యక్రమాల్లో ఎటువంటి మార్పులు ఉండవు. ఆలయాలను సందర్శిస్తారు. చిట్స్, ఫైనాన్స్ రంగాల వారు మొండి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. ప్రముఖుల కలయికతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. 
 
సింహం : స్త్రీలకు ఆరోగ్య భంగం, ఔషధ సేవనం తప్పదు. ప్రయాణాలు వాయిదావేసుకోవడం మంచిది. ఇతరులతో వీలైనంత క్లుప్తంగా సంభాషించడం శ్రేయస్కరం. నిరుద్యోగులు ఏ చిన్న సదావకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. అవివాహితులలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. 
 
కన్య : ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మీ శ్రీమతి సూటిపోటి మాటలు, మొండితనం చికాకు కలిగిస్తాయి. పానీయ చిరు వ్యాపారులకు లాభదాయకం. స్త్రీలకు టీవీ ఛానెళ్ళ నుంచి ఆహ్వానం, పత్రికల నుంచి పారితోషికం అందుతుంది. మీ సంతానం పైచదువుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. 
 
తుల : ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం అధికం. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. ఒక వ్యవహారం నిమిత్తం న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. ఆప్తులకు ప్రియమైన వస్తువుల అందజేస్తారు. 
 
వృశ్చికం : ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం నుంచి విముక్తి లభిస్తుంది. మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజార్చుకుంటారు. మిత్రులను కలుసుకుంటారు. నూతన పరిచయాలు, కార్యకలాపాలు విస్తరిస్తాయి. దంపతుల మధ్య సఖ్యత కొరవడుతుంది. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
ధనస్సు : తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదుర్కొంటారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. పొదుపు పాటించే విషయంలో కుటుంబీకుల నుంచి వ్యతిరేకత, సన్నిహితుల అవహేళనలు ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. 
 
మకరం : ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత, చికాకులు తప్పవు. మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన లోపిస్తుంది. రావలసిన ధనం అందడంతో తనఖా పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. స్త్రీలు తమ ఆధిపత్యం నిలబెట్టుకోవాలనే తాపత్రయం అధికమవుతాయి. 
 
కుంభం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి అశాజనకం. పెద్దవారిలో మందకొడితనం అధికమవుతుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. స్త్రీలకు ఇతరుల వాహనం నడపడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం. 
 
మీనం : వ్యాపార రహస్యాలు, ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచాలి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు అపరిచిత వ్యక్తులు పట్ల అప్రమత్తత అవసరం. తలపెట్టిన పనిలో అవాంతరాలు ఎదుర్కొంటారు. మీ వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలలో భంగపాటుతప్పదు.