సోమవారం, 25 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

30-08-2020 ఆదివారం దినఫలాలు - ఆదిత్య హృదయం వింటే శుభం...

మేషం : బంధువులతో గృహంలో సందడికానవస్తుంది. బంధు మిత్రులతో రహస్య సంభాషణలు కొనసాగిస్తారు. చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించిన ఫలితాలొస్తాయి. మీరు అభిమానించే వ్యక్తుల నుంచి ప్రశంసలు పొందుతారు. మత్స్యు కోళ్ళ వ్యాపారస్తులకు కలిసి రాగలదు. 
 
వృషభం : తలపెట్టిన పనులు ఏమాత్రం ముందుకు సాగవు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇవ్వగలవు. సిమెంట్, వ్యాపారస్తులకు సంతృప్తి కానవస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. రాజకీయాల వారు కార్యకర్తల వల్ల సమస్యలను ఎదుర్కొనక తప్పదు. 
 
మిథునం : యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. కూర, పూల, వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. ఫ్యాన్సీ, కిరాణా, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలిసివచ్చేకాలం. పరిశోధనాత్మక విషయాలపై ఆసక్తి చూపుతారు. కుటుంబీకులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. 
 
కర్కాటకం : వృత్తులలో వారికి ప్రోత్సాహం లభిస్తుంది. బంధువులను కలుసుకుంటారు. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. పాత జ్ఞాపకాలు, గురించి మీ మిత్రులతో చర్చించడంలో ఉల్లాసాన్ని పొందుతారు. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వల్ల అశాంతికి లోనవుతారు. 
 
సింహం : ఆర్థికంగా మంచి అభివృద్ధిని పొందుతారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోనివారికి పనివారికి సామాన్యం. వృత్తుల వారు ఆదాయం కంటే వచ్చిన అవకాశాలను చేజిక్కించుకోవడం శ్రేయస్కరం. స్త్రీలు, టీవీ చానెల్స్ కార్యక్రమాల్లో రాణిస్తారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. 
 
కన్య : మంచి మాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవడానికి యత్నించండి. ఉద్యోగస్తులు మార్పులపై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత మిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. జీవిత భాగస్వామి విషయంలో దాపరికం మంచిదికాదు. పనులకు ఆటంకాలు కల్పించాలనుకున్న వారు సైతం అనుకూలంగా మారుతారు. 
 
తుల : వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవడం శ్రేయస్కరం. మంచి చేసినా విమర్శలు తప్పవు. ఆలయాలను సందర్శిస్తారు. స్త్రీలు తలకు మించిన బాధ్యతలతో తలమునకలౌతుంటే కాస్త ఓపికగా వ్యవహరించండి. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. 
 
వృశ్చికం : భార్య, భర్తల ఆలోచనలు, అభిప్రాయభేదాలు భిన్నంగా ఉంటాయి. నిరుద్యోగులు విజయం సాధిస్తారు. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. వెండి, బంగారు, వస్త్ర వ్యాపారులకు లాభదాకయం. సామూహిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
ధనస్సు : ఆర్థిక విషయాలలో మీ లెక్కలు తారుమారు కాగలవు. ప్రముఖుల సహకారంతో ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఎదుటివారరితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. 
 
మకరం : ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉండటం వల్ల పొదుపు సాధ్యం కాదు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. మిత్రులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. ఒక అవసరానికి మించిన ధనం మరో ఖర్చుకు వినియోగించవలసి వస్తుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. 
 
 
కుంభం : వృత్తుల వారు ఆదాయం కంటే వచ్చిన అవకాశాలను చేజిక్కించుకోవడం శ్రేయస్కరం. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు సహోద్యోగులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఏ విషయంలోనూ హామీలు ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి.
 
మీనం : ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. వైద్యులు ఆపరేషన్లు చేయునపుడు ఏకాగ్రత, మెళకువ చాలా అవసరం. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. ఖర్చులు మీ ఆదాయానికి తగినట్టుగానే ఉంటాయి. ప్రయాణాలు అనుకూలం.