25-08-2020 మంగళవారం దినఫలాలు - శివారాధన చేస్తే...

astro8
రామన్|
మేషం : ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. సమయానికి సహకరించని మిత్రులతీరు నిరుత్సాహం కలిగిస్తుంది. రుణయత్నాలు, విదేశీయానం అనుకూలిస్తాయి. దైవకార్యాల్లో పాల్గొంటారు. సత్కాలం ఆసన్నమైంది. మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చుతాయి. కొంత మంది మీ సాన్నిత్యం కోరుకుంటారు.

వృషభం : మీ మాటకు కుటుంబంలోనూ, సంఘంలోనూ గౌరవం ఏర్పడుతుంది. మీ సంతానం వైఖరి మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు అనుకోకుండా పూర్తి చేస్తారు. ఉద్యోగ యత్నాలు, మార్పులు అనుకూలిస్తాయి. రావలసిన ధనం అనుకోకుండా వసూలవుతుంది.

మిథునం : స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు అనుకూలిస్తాయి. బంధువుల నుంచి ఒక మఖ్య సమాచారం అందుకుంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. సోదరులు మీ ఔన్నత్యాన్ని అర్థం చేసుకుంటారు. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి.

కర్కాటకం : శ్రమాధిక్యత, అకాల భోజనం వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. నిరుద్యోగులకు శుభదాయకం. గృహ మరమ్మతులు, నిర్మాణాలు చేపడతారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. వాదోపవాదాలకు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది.

సింహం : ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులు శ్రమకు గుర్తింపు, ఆర్థిక లబ్ధి వంటి శుభపరిణామాలు ఉంటాయి. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు వ్యాపారులకు పురోభివృద్ధి. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిదికాదని గమనించండి.

: నూతన వ్యాపారాలు, సంస్థలు, పరిశ్రమల స్థాపనలు అనుకూలిస్తాయి. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. అవివాహితులకు శుభదాకయం. రావలసిన ధనం చేతికందడంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి.

: స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు పరీక్షల్లో సత్ఫలితాలు సాధిస్తారు. పొగడ్తలు, హామీలకు దూరంగా ఉండాలి. వృత్తుల వారికి ఆశాజనకం. గృహోపకరణాలు, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. వివాహ, ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. ఖర్చులు, కుటుంబ అవసరాలు అధికమవుతాయి.

వృశ్చికం : స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోనూ అప్రమత్తత అవసరం. ఉపాధ్యాయుల శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాలకు శ్రీకారం చుట్టండి. వాహన చోదకులకు చికాకులు తప్పవు. కాంట్రాక్టర్లు అసాధ్యమనుకున్న టెండర్లు చేజిక్కించుకుంటారు.

ధనస్సు : ఆపరేషన్లు చేయునపుడు మెళకువ ఏకాగ్రత చాలా అవసరం. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. విద్యార్థులకు వ్యాపకాలు అధికమవుతాయి. భాగస్వామిక ఆస్తి, వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించిన చికాకులు తొలగిపోగలవు.

మకరం : వృత్తులు, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తులు స్థానమార్పిడి కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు పనివారలతో సఖ్యత లోపిస్తుంది. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు చికాకులు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దీక్షలు స్వీకరిస్తారు.

కుంభం : బంధువుల రాక మీకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రయాణాలు వాయాదిపడతాయి. పాత మిత్రుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. ఒకరికి సలహా ఇచ్చి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. స్త్రీలకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. చేపట్టి పనులు వాయిదాపడతాయి. కుటుంబ సౌఖ్యం పొందుతారు.

మీనం : బంధువులు మీ నుంచి పెద్ద మొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. విద్యార్థుల అత్యుత్సాహం విపరీతాలకు దారితీసే ఆస్కారం ఉంది. స్త్రీలకు మనోవాంఛలు నెరవేరుతాయి. వాహనం నడుపుతున్నపుడు విద్యార్థులకు ఏకాగ్రత అవసరం. కొబ్బరి, పండ్లు, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసివస్తుంది.దీనిపై మరింత చదవండి :