శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

22-08-2020 శనివారం రాశిఫలాలు - గణేషుని వివిధ పత్రాలతో అర్చన చేస్తే..

మేషం : కార్యసాధనలో ఓర్పు, పట్టుదల అవసరం. వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు, పథకాలు అమలు చేస్తారు. నిరుద్యోగులకు అశాజనకం. ఒకసారి జరిగిన తప్పిదం పునరావృతం కాకుండా జాగ్రత్తపడండి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. 
 
వృషభం : స్త్రీలకు ఆరోగ్యంలో తగుజాగ్రత్తలు అవసరం. అపార్థాలుమాని ఇతరులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. మీ సంతానం విద్య, వివాహాల విషయంలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. నూతన వస్తువులను అమర్చుకుంటారు. 
 
మిథునం : బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు మంచి గుర్తింపు లభిస్తుంది. కానివేళలో ఇతరులరాక ఇబ్బంది కలిగిస్తుంది. పాత మిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. 
 
కర్కాటకం : మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించేవారుండరు. ఆత్మీయులకు ఆపత్సమయంలో అండగా నిలుస్తారు. స్త్రీలకు పనివారలతో చికాకులు అధికమవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఖర్చులు, చెల్లింపులలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. 
 
సింహం : దంపతుల మధ్య చికాకులు అధికమవుతాయి. సోదరుల మధ్య సఖ్యత అంతగా ఉండదు. అనుకున్న పనులు ఆశించినంత చురుకుగా సాగవు. కొంతమంది మీ యత్నాలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. రాజకీయ నేతలు ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తంగా మెలగాలి. బంధువుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. 
 
కన్య : కొంతమంది మీ ఆలోచనలను పక్కదారి పట్టించే ఆస్కారం ఉంది. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు బిల్డర్లకు ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. స్త్రీల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికం. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. 
 
తుల : ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి పనిభారం అధికం. దైవ, శుభకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్థిరాస్తులు, వాహనం కొనుగోలు చేస్తారు. విద్యార్థినులకు ఇంజనీరింగ్, టెక్నికల్ రంగాల్లో అవకాశం లభిస్తుంది. ప్రముఖులతో పరియాలేర్పడతాయి. భాగస్వామిక చర్చలు అర్థాంతరంగా ముగుస్తాయి. 
 
వశ్చికం : ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. నూతన దంపతుల మధ్య కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. విద్యార్థులలో మందకొడితనం పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. స్త్రీలకు వస్త్ర, వస్తులాభం, ఆహ్వానాలు వంటి శుభపరిణామాలు. వృత్తులవారికి సామాన్యం. 
 
ధనస్సు : ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. ప్రభుత్వాధికారుల నుంచి ఒత్తిడి, వేధింపులు ఎదుర్కొంటారు. చేపట్టిన పనుల పట్ల ఏకాగ్రత లోపిస్తుంది. ఆత్మీయులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. క్రయ, విక్రయాలు సంతృప్తినిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. 
 
మకరం : ఉద్యోగస్తులకు ఆకస్మిక బదిలీ వల్ల ఒడిదుడుకులు తప్పవు. ఖర్చులు ఊహించినవి కావడంతో ఇబ్బందులు అంతగా ఉండవు. భాగస్వామిక చర్చలు, వాణిజ్య ఒప్పందాలు అనుకూలిస్తాయి. కుటుంబీకులతో కొత్త విషయాలు చర్చిస్తారు. స్త్రీల అభిప్రాయాలకు వ్యతిరేకత ఎదురవుతుంది. వాహనచోదకులకు చికాకులు తప్పవు. 
 
కుంభం : భాగస్వామిక చర్చలు అర్థాంతరంగా ముగుస్తాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి పనిభారం అధికం. దైవ, శుభకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్థిరాస్తులు, వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో సఫలీకృతులవుతారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మెలకువ వహించండి. 
 
మీనం : వస్త్ర, బంగారం వ్యాపారులకు పురోభివృద్ధి. గృహంలో మార్పులు, మరమ్మతులు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. దైవ, శుభకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్యలలో అవకాశం లభిస్తుంది. స్త్రీలకు భర్త తరపు బంధువులతో పట్టింపులు అధికమవుతాయి.