గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

21-08-2020 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవిని పూజించి ప్రార్థిస్తే..

మేషం : చేతిలో ధనం నిలవడం కష్టమవుతుంది. క్రీడా, కళా రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. రావలసిన మొండిబాకీలు వసూలవుతాయి. కార్యసాధనలో పట్టుదలతో వ్యవహరించి సత్ఫలితాలు పొందుతారు. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. 
 
వృషభం : ఫ్యాన్సీ, కిరాణా, మందుల వ్యాపారస్తులకు లాభదాయకం. తల, కాళ్లు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. తొందరపడి వాగ్దానాలు చేసి సమస్యలకు గురికాకండి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. 
 
మిథునం : మీరు ఓ స్నేహితునితో కలిసి మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ, అల్కహాల్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. రాజకీయ నాయకులు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. 
 
కర్కాటకం : ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసిరాగలదు. కుటుంబీకులతో అవగాహనా లోపం వంటివి ఎదుర్కొంటారు. విద్యార్థులు ఇతరుల కారణంగా మాటపడవలసి వస్తుంది. రావలసిన ధనంలో కొంత మొత్తం వసూలుకాగలదు. నిరుద్యోగులు నిరాశ, నిస్పృహలకు లోనవుతారు. 
 
సింహం : విదేశాలు వెళ్లడానికి చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలబడతారు. ఇతరులు మీ పట్ల ఆకర్షితులవుతారు. మీ యత్నాలకు ప్రముఖుల నుంచి సహాయ సహకారాలు అందిస్తారు. కార్యసాధనలో పట్టుదలతో వ్యవహరించి సత్ఫలితాలు పొందుతారు. పాత రుణాలు తీరుస్తారు. 
 
కన్య : దైవ, దర్శనాల వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. రవాణఆ రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు ఏకాగ్రత చాలా అవసరం. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ, ఆల్కహాలు వ్యాపారస్తులకు పురోభిృద్ధి కానవస్తుంది. రావలసిన బకాయిలు వాయిదాపడుట వల్ల ఆందోళనకు గురవుతారు. 
 
తుల : స్త్రీలు ఏమరుపాటుతనం, నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం కలదు. ఒకేసారి అనేక పనులు మీదపడటంతో ఒత్తిడికి లోనవుతారు. కుటుంబీకులతో కలిసి విందు, వేడుకల్లో పాల్గొంటారు. కోర్టు వాదోపవాదాల్లో ఫ్లీడర్లకు మంచి గుర్తింపు లభిస్తుంది. గత అనుభవాలు జ్ఞప్తికి రాగలవు. 
 
వృశ్చికం : కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. ఏ వ్యవహారం తలపెట్టినా గోప్యంగా వ్యవహరించాలి. దుబారా ఖర్చులు అధికం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. విద్యా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం మొదలవుతుంది. మీ అభిప్రాయాలు, ఆలోచనలకు మిశ్రమ స్పందన పొందుతారు. 
 
ధనస్సు : ప్రముఖులను కలుసుకుని బహుమతులు అందజేస్తారు. క్రయ, విక్రయ రంగాలలోనివారికి నూతన ఉత్సాహం కానవస్తుంది. ఒక నష్టం మరో విధంగా భర్తీ కాగలదు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. 
 
మకరం : ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత మఖ్యం. సంఘంలో మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. ఆకస్మికంగా ప్రయాణాలు సంభవిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాల కోసం ధనం బాగుగా ఖర్చు చేస్తారు. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. బ్యాంకింగ్ వ్యవహారాలలో పనులు మందకొడిగా సాగుతాయి. 
 
కుంభం : మీ ఆలోచనా దృష్టిని మరికాస్త పెంపొందించుకోండి. స్త్రీలపై చుట్టుపక్కల వారి ప్రభావం అధికంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. 
 
మీనం : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. సన్నిహితుల హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మున్ముందు మంచి ఫలితాలనిస్తాయి.