గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2020 (17:35 IST)

20-08-2020 గురువారం రాశిఫలాలు - దత్తాత్రేయుడిని ఆరాధిస్తే మీ సంకల్పం...

మేషం : స్త్రీలు అదనపు ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తారు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త పథకాలు మొదలవుతాయి. మీ యత్నాలూ, తెలివితేటలూ ఓర్పుల కారణంగా మీ రంగంలో మంచి గుర్తింపును పొందుతారు. క్రీడ, కళ, సాంస్కృతిక రంగాల పట్ల ఆసక్తి వహిస్తారు.
 
వృషభం : స్వయంకృషితో బాగా రాణిస్తారు. ఉపాధ్యాయులు అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ధనం ఏమాత్రం పొదుపు సాధ్యంకాదు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ, ఏకాగ్రత అవసరం. గృహ నిర్మాణం, ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధుల సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
మిథునం : కొంతమంది మీ దృష్టిని మళ్లించి మోసగించే ఆస్కారం ఉంది. రావలసిన ధనం వాయిదాపడుటవల్ల ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వ్యాపారాల్లో నిలదొక్కుకోవడంతో పాటు అనుభవం గడిస్తారు. ఫ్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. 
 
కర్కాటకం : నిత్యావసర వస్తు వ్యాపారులకు కలిసిరాగలదు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. ఒక్కసారి ప్రేమిస్తే ఆ ప్రేమను నిలబెట్టుకోవడానికి ఎంతైనా పోరాడుతారు. అనాలోచితంగా మాటజారి ఇబ్బందులెదుర్కొంటారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. 
 
సింహం : బకాయిలు, ఇంటి అద్దెలు తదితర వసూళ్ళలో లౌక్యంగా మెలగండి. మీ కళత్ర మొండివైఖరి మీకు సంతోషం కలిగిస్తుంది. మీ అతిథి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రియతములతో ప్రయాణాల్లో ఊహించని చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. 
 
కన్య : బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. ఆహార విషయంలో వేళ తప్పి భుజించుట వల్ల ఆరోగ్య భంగం. వ్యాపారాల్లో ఆకర్షణీయమైన పథకాలతో వినియోగదారులను ఆకట్టుకుంటారు. స్త్రీలు, టీవీ, కార్యక్రమాల్లో రాణిస్తారు. 
 
తుల : గృహంలో నెలకొన్న అశాంతి తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. స్త్రీలకు, నరాలు, ఉదరం, దంతాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. 
 
వృశ్చికం : కుటుంబ సౌఖ్యం, తరచూ విందు భోజనాలు వంటి శుభ సంకేతాలున్నాయి. తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి విమర్శలుతప్పవు. స్త్రీలకు ఆరోగ్య భంగం, నీరసం వంటి చికాకులు తప్పవు. పెద్ద మొత్తంలో చెక్కులిచ్చే విషయంలో మెళకువ వహించండి. 
 
ధనస్సు : విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారం తెలుసుకుంటారు. శారీరక శ్రమ, నిద్రలేమి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మిత్రులను కలుసుకుంటారు. దుబారా ఖర్చులు నివారించడం సాధ్యపడక పోవచ్చు. మీ శ్రీవారి వైఖరిలో మార్పు ఆందోళన కలిగిస్తుంది. 
 
మకరం : మీ అవసరాలకు కావలసిన ధనం కోసం నానాపాట్లు పడతారు. బంధువుల రాకతో ఇబ్బందులెదుర్కొంటారు. విద్యార్థులు బజారు తినుబండరాలు భుజించుటవల్ల అస్వస్థతకు లోనవుతారు. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉపాధ్యాయ రంగాలలో వారికి అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి. 
 
కుంభం : హోటల్, కేటరింగ్, తినుబండారు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. తెలివిగా వ్యవహరిస్తున్నామనుకుని తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో ఏ మార్పు, పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. స్త్రీలతో మిత సంభాషణ క్షేమదాయకం. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. 
 
మీనం : స్త్రీలకు కాళ్లు, నడుము, తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి, పనిభారం వంటి చికాకు లెదురవుతాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. రేపటి కార్యక్రమాల గురించి ఈ రోజే ఆలోచించి క్రియారూపంలో పెట్టండి.