శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

17-08-2020 సోమవారం రాశిఫలాలు - గణపతిని ఎర్రని పూలతో పూజించినా...

మేషం : చేతి వృత్తుల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పదవులు, సభ్యత్వాలకు వీడ్కోలు పలుకుతారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. 
 
వృషభం : కుటుంబ సభ్యులను నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించేవారుండరు. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుటవల్ల మాట పడవలసి వస్తుంది. శత్రువులు మిత్రులుగా మారతారు. 
 
మిథునం : మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. ఖర్చులు అదుపుకాగపోగా మరింత ధన వ్యయం అవుతుంది. 
 
కర్కాటకం : ఎరువులు, రేషన్, గ్యాస్ డీలర్లకు అధికారులతో సమస్యలు తప్పవు. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలిస్తాయి. ఊహించని ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. ఆత్మీయులకిచ్చిన మాట నిలబెట్టుకుంటారు.
 
సింహం : బంధువులతో సంబంధాలు మరింతగా బలపడతాయి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. పెద్దల ఆరోగ్యంలో సంతృప్తి కానవస్తుంది. ఊహించని ఖర్చులు, తప్పనిసరి చెల్లింపుల వల్ల ఒకింత ఒడిదుడుకులు తప్పవు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదాపడతాయి. 
 
కన్య : ఉద్యోగస్తులు తోటివారి నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. ఏజెంట్లకు, బ్రోకర్లకు ఒత్తిడి పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ రంగాల వారికి సామాన్యం. ప్రియతముల రాక సంతోషం కలిగిస్తుంది. స్త్రీలకు పనివారలతో సమస్యలు తప్పవు. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. 
 
తుల : ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వాహనం నడుపుతున్నపుడు మెళకువ అవసరం. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. వృత్తులు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. వివాహ, ఉద్యోగ యత్నాలు కలిసిరాగలవు. మితిమీరిన శ్రమ, విశ్రాంతి లోవం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. 
 
వృశ్చికం : అనుకోని ఖర్చులు, తప్పనిసరి చెల్లింపులు ఆందోళన కలిగిస్తాయి. రుణ యత్నాలలో ఆటంకాలు తొలగిపోయి రావలసిన ధనం చేతికందుతుంది. స్త్రీలకు బంధు వర్గాలతో సఖ్యత నెలకొంటుంది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం మంచిది. మీ యత్నాలను కొంతమంది నీరుగార్చేందుకు యత్నిస్తారు. 
 
ధనస్సు : స్త్రీలకు అతిగా సంభాషించడం వల్ల అపార్థాలకు గురికావలసి వస్తుంది. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు చికాకులు తప్పవు. మీరంటే గిట్టని వారు మీకు దగ్గరయ్యేందుకు యత్నిస్తారు. ప్రముఖుల సహకారంతో ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాల వారితో సమస్యలను ఎదుర్కొంటారు. 
 
మకరం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. విద్యార్థులకు ఒత్తిడి, మందలింపులు తప్పవు. స్త్రీలకు శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదాపడతాయి. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. 
 
కుంభం : ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ప్రముఖుల ఇంటర్వ్యూల కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. రియల్ ఎస్టేట్, ఏజెంట్లకు, బ్రోకర్లకు మిశ్రమ ఫలితం. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. 
 
మీనం : కొత్త వ్యాపారాలు చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. దుబారా నివారించడానికై చేయు యత్నాలు ఫలించవు. బంధు మిత్రులతో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తుల వారికి లభించిన అవకాశాలు ఆశించినంత సంతృప్తికరంగా ఉండవు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.