శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

12-08-2020 బుధవారం రాశిఫలాలు - మహావిష్ణువును ఆరాధిస్తే...

మేషం : ప్రైవేటు సంస్థల్లో వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సజావుగా సాగుతాయి. మీ మాటలు ఇతరులకు జారవేసే వ్యక్తులున్నారని గమనించండి. వైద్య, ఇంజనీరంగ్ కంప్యూటర్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులకు ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. 
 
వృషభం : అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. విద్యా సంస్థల్లో శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. పాత మిత్రుల కలయికతో మీలో కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్త్రీలకు చీటికిమాటికి అసహనం, చికాకులు అధికమవుతాయి. 
 
మిథునం : ఉపాధ్యాయులకు రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి, చికాకులు తప్పవు. మంచి వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వకార్యాల్లో మీ పనులు సానుకూలిస్తాయి. ఒకసారి జరిగిన తప్పిదం పునరావృతంకాకుండా జాగ్రత్త పడండి. స్త్రీలు తేలికగా మోసపోయే ఆస్కారం ఉంది. 
 
కర్కాటకం : వస్త్ర, బంగారం, వెండి, గృహోపకరణ వ్యాపారులకు ఆశాజనకం. ప్రలోభాలకు లొంగవద్దు. ఉద్యోగ విరమణ చేసిన వారికి రావలసిన బెనిఫిట్స్ ఆలస్యంగా అందుతాయి. చేపట్టిన పనిలో ప్రతి బంధకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తిచేస్తారు. మీ ప్రత్యర్థులను తక్కువగా అంచనా వేయడం వల్ల భంగపాటు తప్పదు. 
 
సింహం : ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవడం మంచిది. ప్రేమ వ్యవహారాల పట్ల ఆసక్తి కనబర్చడం వల్ల ఒత్తిడి, మందలింపులు ఎదుర్కోక తప్పదు. ఉద్యోగస్తులు ఓర్పు, కార్యదీక్షతో పనిచేయవలసి ఉంటుంది. 
 
కన్య : ఖాదీ, నూలు, చేనేత, కలంకారీ వస్త్ర వ్యాపారులకు మిశ్రమ ఫలితం. కీలకమైన వ్యవహారాలలో పెద్దల సలహా పాటించండి. స్పెక్యులేషన్ రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బ్యాంకింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. దైవ దర్శనాలవల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో అనుకూలం. 
 
తుల : సంఘంలో మంచి గుర్తింపు పొందుతారు. పుణ్యకార్యాల్లో నిమగ్నులవుతారు. ఇతరులకు వాహనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం బాగా వ్యయం చేయడం మంచిదికాదని గమనించండి. స్త్రీలు, షాపింగ్ విషయాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ వహించండి. 
 
వృశ్చికం : ప్రైవేటు సంస్థల్లో వారు అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం వహించవలసి ఉంటుంది. ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. రుణ విమక్తులు కావడంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు. మిమ్మల్ని చూసి ఈర్ష్య పడేవారు అధికం అవుతున్నారని గమనించండి. 
 
ధనస్సు : అకాలభోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. స్త్రీలకు అదనపు సంపాదనపట్ల ఆసక్తి పెరుగుతుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. చిన్న తరహా పరిశ్రమలు, చిరువృత్తుల వారికి సామాన్యం. ఒకానొక సమయంలో చేతిలో ధనం లేక బాగా అవస్థపడతారు. 
 
మకరం : మనోధైర్యంతో యత్నాలు సాగించండి. కార్మికులకు తాపీ పనివారికి సమస్యలు తప్పవు. సాఫ్ట్‌వేర్, కంప్యూటర్ రంగాల వారికి ఆందోళన తప్పదు. సన్నిహితుల సహకారం వల్ల మీ పాత సమస్యలు పరిష్కరించబడతాయి. నిరుద్యోగులు, చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
కుంభం : ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తులను ఓ కంట కనిపెట్టడం మంచిది. సర్దుబాటు ధోరణితో మెలిగినగాని ఇంట మనశ్శాంతి ఉండదు. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. ఐరన్, ఆటోమొబైల్, ట్రాన్స్‌పోర్టు రంగాల్లో వారికి ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. మీ వాగ్ధాటి, సమయస్ఫూర్తితో కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. 
 
మీనం : మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. దంపతుల మధ్య కలహాలు చోటుచేసుకుంటాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు, వృత్తుల వారికి కలిసిరాగలదు. ధనం పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరదు. అతికష్టంమీద అనుకున్న పనులు పూర్తిచేస్తారు.