శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

11-08-2020 మంగళవారం రాశిఫలాలు - శ్రీకృష్ణుడిని ఆరాధించినా....

మేషం : ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. చిట్స్, ఫైనాన్స్, వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురవుతారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. 
 
వృషభం : స్త్రీల ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. రాజకీయ నాయకులకు విదేశీ పర్యటనలు అనుకూలం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. ధనం ఎంత వ్యయం చేసినా ఫలితం ఉండదు. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మిథునం : వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. మీరు చేయదలచుకున్న ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా సాగవు. వృత్తులవారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. 
 
కర్కాటకం : స్త్రీలకు అకాలభోజనం వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన మంచిది. అయిన వారే మిమ్మలను అపార్థం చేసుకుంటారు. పాత బాకీలు వసూలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బంది తొలగుతుంది. 
 
సింహం : ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. కొబ్బరి, పండ్లు, పూల, తమలపాకులు, చిరు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు మీరే చేసుకోవడం మంచిది. గృహంలో చికాకులు తొలగి ప్రశాంతత నెలకొంటుంది. స్త్రీలకు అలంకరణలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. 
 
కన్య : వస్త్రాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పులు గమనిస్తారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. రుణాలు, చేబదుళ్లు స్వీకరించవలసి వస్తుంది. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రులను కలుసుకుంటారు. 
 
తుల : కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచడం చాలా అవసరం. వ్యాపార అభివృద్ధికి చేసే కృషి ఫలిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ఒక స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు. మీ శ్రీమతిని, పిల్లలను మెప్పించడం కష్టమవుతుంది. 
 
వృశ్చికం : మత్స్యు కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాకయకంగా ఉంటుంది. సహోద్యోగులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఆప్తుల నుంచి కొత్త విషయాలు గ్రహిస్తారు. మీ అభిరుచి ఆశయాలకు తిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. 
 
ధనస్సు : దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఆలస్యంగానైనా అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు లభించిన అవకాశం తాత్కాలికమే అయినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. 
 
మకరం : మధ్యవర్తిత్వం, వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఒకే కాలంలో అనేక పనులు చేపట్టుట వల్ల దేనిమీద ఏకాగ్రత వహించలేరు. భార్యాభర్తల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. 
 
కుంభం : ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆలయ సందర్శనాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు క్రీడలు, క్విజ్ వంటి పోటీలలో రాణిస్తారు. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. 
 
మీనం : ఉమ్మడి ఆర్థిక లావాదేవీలలో మాటపడాల్సిరావొచ్చు. హోటల్, తినుబండరాల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీ ప్రత్యర్థులకు వారి పద్దతిలోనే గుణపాఠం నేర్పవచ్చు. పెద్దల ఆరోగ్యంలో శ్రద్ధ వహించండి. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. పాత మిత్రుల కలయిక మీకు ఎంతో సంతృప్తినిస్తుంది.