శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

13-08-2020 గురువారం రాశిఫలాలు - బాబా గుడిలో అన్నదానం చేస్తే..

మేషం : స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. దైవసేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. క్రయ, విక్రయ రంగాల్లో వారికి నూతన ఉత్సాహం కానవస్తుంది. కాంట్రాక్టర్లకు అధికమైన ఒత్తిడి తప్పదు. వాహన విషయంలో సంతృప్తి కానవస్తుంది. 
 
వృషభం : విద్యార్థులు ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్లేందుకు మార్గం సుగమమంవుతుంది. ఇతరుల ఆంతరంగిక విషయాలలో తలదూర్చకండి. మీ కళత్ర మొండివైఖరి, కుటుంబీకుల పట్టుదల మనశ్శాంతిని దూరం చేస్తాయి. ఇంటర్వ్యూలలో శ్రద్ధ వహించండి. విద్యార్థినుల ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. 
 
మిథునం : రావలసిన బకాయిల విషయంలో మెళకువ అవసరం. సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం మంచిదని గమనించండి. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. స్నేహ పరిచయాలు విస్తరిస్తాయి. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. 
 
కర్కాటకం : ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆహార వ్యవహారాల్లో మెళకువ వహించండి. ఐరన్, సిమెంట్, కలప రంగాలలో వారికి చికాకులు తప్పవు. మీ యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం, సహకారం అందిస్తారు. ఖర్చులకు సరిపడ ఆదాయం సమకూర్చుకుంటారు. 
 
సింహం : ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా అధికారులతో మాటపడాల్సి వస్తుంది. షేర్ మార్కెట్ రంగాల వారికి సామాన్యం. పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారస్తులకు లాభదాయకం మీ ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి. మీ సంతానం చదువుల్లో బాగా రాణిస్తారు. నిర్మాణ పథకాలలో పురోభివృద్ధి కానవస్తుంది. 
 
కన్య : దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. లిటిగేషన్ వ్యవహారలో జాగ్రత్త వహించండి. ధనం సమయానికి అందుట వల్ల సంతృప్తికానవస్తుంది. బంధు మిత్రులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. 
 
తుల : రచయితలకు, పత్రికా రంగంలో వారికి కీర్తి గౌరవాలు పెరుగుతాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. రాజకీయాల్లో వారి తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. కందులు, ఎండుమిర్చి, స్టాకిస్టులు, వ్యాపారస్తులు, సంతృప్తికానవస్తుంది. రవాణా రంగాలలో వారికి మిశ్రమ ఫలితం కానవస్తుంది. 
 
వృశ్చికం : ఉపాధ్యాయులు ఒత్తిడి, సమస్యలకు లోనవుతారు. ఎదుటివారు మీకు సమఉజ్జీలేనని గ్రహించండి. గత అనుభవాలు జ్ఞప్తికి రాగలవు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. కుటుంబీకుల నుంచి సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య రసాయన వ్యాపారస్తులకు లాభదాయకం. 
 
ధనస్సు : విద్యార్థులకు అతి ఉత్సాహం వల్ల సమస్యలు తలెత్తుతాయి. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. స్త్రీలకు నూతన వ్యక్తుల పరిచయం ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది. మార్కెటింగ్ రంగాల్లో వారికి పత్రికా, ప్రైవేటు సంస్థల్లో వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఊహించని ఖర్చులు వల్ల స్వల్ప ఇబ్బందులు తప్పవు. 
 
మకరం : శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. నిరుద్యోగులు భవిష్యత్ గురించి పథకాలు వేసిన సత్ఫలితాలు పొందుతారు. ఖర్చులు అధికమవుతాయి. ఉపాధ్యాయులకు ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. స్త్రీలు, ప్రముఖుల సిఫార్సుతో దైవ దర్శనాలను త్వరగా ముగించుకుంటారు. నూతన ఎగ్రిమెట్లు, వాయిదా వేయండి. 
 
కుంభం : ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రావలసిన డబ్బులు చేతికి అందడం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. స్త్రీలు తేలికగా మోసపోయే ఆస్కారం ఉంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. ప్రముఖులను కలుసుకుని బహుమతులు అందజేస్తారు. 
 
మీనం : ఆర్థిక విషయాల్లో ఒక అడుగు ముందుకు వేస్తారు. కొంతమంది మీ సహాయం పొంది మిమ్మల్ని తక్కువ అంచనా వేయడం వల్ల ఆందోళనకు గురవుతారు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. కాంట్రాక్టర్లకు అధికారులతో అహగాహన కుదరదు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు ఒడిదుడుకులు తప్పవు.