గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

19-08-2020 బుధవారం రాశిఫలాలు - సత్యదేవుని పూజిస్తే శుభం ...

మేషం : సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లలో పునరాలోచన అవసరం. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. రాజకీయ నాయకులు విదేశీ పర్యటనలు చేయవలసి వస్తుంది. 
 
వృషభం : విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ఏ వ్యవహారమూ కలిసి రాకపోవడంతో ఒకింత నిరుత్సాహం చెందుతారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో ప్రశాంతత చోటుచేసుకుంటుంది. బ్యాంకు పనులు వాయిదాపడతాయి. నిరుద్యోగులకు అవకాశాలను చేజార్చుకుంటారు. 
 
మిథునం : ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనివారితో చికాకులు వంటివి ఎదుర్కొంటారు. వాయిదాపడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. మీ సమస్యలకు ఆత్మీయుల నుంచి చక్కని పరిష్కార మార్గం గోచరిస్తుంది. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించేవారుండరు. 
 
కర్కాటకం : ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. ఆత్మీయుల ద్వారా కీలకమైన విషయాలు గ్రహిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. చేపట్టిన పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తిచేస్తారు. 
 
సింహం : ఖర్చులు అదుపుకాకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. విద్యార్థులలో మానసిక ప్రశాంతత చోటుచేసుకుంటుంది 
 
కన్య : ఆర్థికాభివృద్ధికి చేయు కృషిలో ఆశాజనకమైన మార్పులుంటాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. వ్యాపార, ఇతరులకు ధన సహాయం చేసే విషయంలో మెళకువ అవసరం. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. 
 
తుల : వాతావరణంలో మార్పు మీకు ఆందోళన కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రతి విషయంలో ఓర్పు అవసరమని గమనించండి. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. నిర్మాణ పథకాలలో సంతృప్తి కానవస్తుంది. వాయిదాపడుతూ వస్తున్న కోర్టు వ్యవహారాలు పునఃప్రారంభిస్తారు. 
 
వృశ్చికం : పారిశ్రామిక రంగంలోని వారికి క్రమంగా మార్పులు రాగలవు. అవివాహితులకు అనుకూలమైన కాలం. సోదరులను కలుసుకుంటారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. మీరు అనుకున్నది సిద్ధిస్తుంది. ఉపాధ్యాయులకు నూతన వాతావరణం, పరిస్థితులు ఆందోళన కలిగిస్తాయి. 
 
ధనస్సు : వ్యాపారాలపట్ల ఆసక్తి పెరగగలదు. సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాలలో వారికి అనుకూలంగా ఉండును. ఫ్లీడర్లకు, గుమస్తాలకు పురోభివృద్ధి. క్రీడా రంగంలోని వారికి సంతృప్తి కానరాగలదు. పట్టుదలతో శ్రమించి అనుకున్న పనులు పూర్తిచేస్తారు. 
 
మకరం : తోటలు, వ్యవసాయ రంగంలోని వారికి చికాకులు తప్పవు. రవాణా రంగాల వారు తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. గత విషయాలు జ్ఞప్తికిరాగలవు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఐరన్, సిమెంట్, కలప, ఇటుక వ్యాపారస్తుల శ్రమకు తగిన ఫలితం కానరాగలదు. 
 
కుంభం : హామీలు ఉండుట వల్ల మంచిది కాదని గమనించండి. వాణిజ్య ఒప్పందాలు వాయిదా వేయగలరు. వేళ తప్పి ఆహారం భుజించుట వల్ల ఆరోగ్యం భంగం. ప్రింటింగ్ రంగాల వారికి  బకాయిల వసూళ్లలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. కూరగాయలు, పండ్లు, పూల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
మీనం : టీవీ, రేడియో, సాంకేతిక రంగాలలో వారికి మంచి గుర్తింపు. ఆపరేషన్లు చేయునపుడు వైద్యులకు మెళకువ అవసరం. ఆత్మివిశ్వాసంతో ముందుకుసాగి జయం పొందండి. రాజకీయలలోనివారికి తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలు ఎదుర్కొంటారని చెప్పవచ్చు. ప్రత్తి, పొగాగు, చెరకు రైతులకు కలిసివచ్చే కాలం.