మేషం : బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు వాయిదాపడతాయి. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలు చీటికి మాటికి అసహనం, చికాకులు అధికమవుతాయి. అయినవారిని, ఆప్తులను విందు భోజనానికి ఆహ్వానిస్తారు. వృషభం : వైద్యులు ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రముఖులతో వ్యాపకాలు అధికమవుతాయి. మిత్రులతో కలిసి షాపింగ్ చేస్తారు. ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో...