23-08-2020 ఆదివారం దినఫలాలు - లలిత సహస్రనామం చదివితే సర్వదా శుభం..

astro7
రామన్|
మేషం : కిరణా ఫ్యాన్సీ, మందులు, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు సంతృప్తి. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. స్త్రీలకు చుట్టుపక్కల వారి ధోరణి ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రయాణాలు కీలకమైన వ్యవహారాల్లో మెళకువ వహించండి. ఆకస్మిక ఖర్చులు, ఇతరాత్రా అవసరాలు అధికమవుతాయి.

వృషభం : ఆర్థిక విషయాల్లో ఒక అడుగు ముందుకు వేస్తారు. వస్త్ర, బంగారం, వెండి, గృహోపకరణ వ్యాపారులకు లాభదాయకం. ఆలయాలను సందర్శిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో మీ మొండివైఖరి వదిలి ప్రశాంతత వహించుట మంచిది. ఒకేకాలంలో అనేక పనులు చేపట్టం వల్ల కాంట్రాక్టర్లకు ఒడిదుడుకులు తప్పవు.

మిథునం : స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలనివ్వవు. మీరు చేసే పనులకు బంధువుల నుంచి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోక తప్పవు. ముఖ్యుల గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు పనిభారం అధికం. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. ఒక వ్యవహారంలో బంధు మిత్రుల మధ్య ఏకాభిప్రాయం లోపిస్తుంది.

కర్కాటకం : గృహంలో ఏదైనా వస్తువు పోయేందుకు ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. చేపట్టిన పనులు ఆకస్మికంగా వాయిదా వేయవలసి వస్తుంది. స్త్రీలతో మితంగా సంభాషించడం క్షేమదాయకం. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి లోనవుతారు.

సింహం : కొంతమంది మిమ్మలను ధనసహాయం లేక హామీలు కోరవచ్చు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తాయి. రాజకీయాలలో విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి.

కన్య : స్త్రీలు చుట్టుపక్కల వారి నుంచి గౌరవం, ఆదరణ లభిస్తుమంది. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. వాతావరణంలో మార్పులు వల్ల మీ పనులు మందకొడిగా సాగుతాయి. వాహనం నడుపునపుడు మెళకువ వహించండి. రుణం కొంత మొత్తం తీర్చడంతో ఒత్తిడి కుదుటపడతారు.

తుల : ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. దైవ, సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. మీ అలవాట్లు, బలహీనతలు గోప్యంగా ఉంచండి. వ్యాపారాభివృద్ధికి పలు ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. ఊహించని ఖర్చులు, పెరిగిన అవసరాలు వల్ల స్వల్ప ఇబ్బందులను ఎదుర్కొంటారు.

వృశ్చికం : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. క్రీడ, సంగీత, నృత్య కళాకారులకు సదావకాశాలు లభిస్తాయి. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వల్ల అశాంతికి గురవుతారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు మీకు అనుకూలిస్తాయి.

ధనస్సు : అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. అనవసరపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ఉద్యోగస్తుల శ్రమకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ఖర్చులు, ఇతరాత్రా అవసరాలు అధికమవుతాయి.

మకరం : విద్యార్థులకు తమ ధ్యేయం పట్ల ఆసక్తి, పట్టుదల అధికమవుతాయి. స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలనివ్వవు. హామీలు ఉండటం మంచిది కాదని గమనించండి. వాహనం నపుడునపుడు మెళకువ వహించండి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి సామాన్యం. బంధు మిత్రులను కలుసుకుంటారు.

కుంభం : వృత్తులు, చిన్న తరహా పరిశ్రమల వారికి ఆశాజనకం. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తత అవసరం. ముఖ్యమైన వన్యవహారాలలో మీ మొండివైఖరి వదిలి ప్రశాంతత వహించుట మంచిది. అనవసరపు వివాదాల్లో తలదూర్చి ఇబ్బందులకు గురికాకండి. సొంత వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

మీనం : ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి కలిసిరాగలదు. దూర ప్రయాణాలు, ధన చెల్లింపులలో మెళకువ వహించండి. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి సామాన్యం. పారిశ్రామిక రంగంలోని వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పట్టు, ఖాదీ, కళంకారీ, చేనేత వస్త్ర వ్యాపారులకు ఆశాజనకం.దీనిపై మరింత చదవండి :