శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2020 (21:23 IST)

30-08-2020 నుంచి 05-09-2020 వరకు మీ వార రాశి ఫలితాలు-video

మేషం: అశ్వని, భరణి, కృత్తిక, 1వ పాదం
ప్రణాళికలు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలించవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం, దంపతుల మధ్య అకారణ కలహం. గురు, శుక్ర వారాల్లో కొత్త సమస్యలు ఎదురౌతాయి. పెద్దల సలహా పాటించండి. పంతాలకు పోవద్దు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ద అవసరం. ముఖ్యుల కలయిక వీలుపడదు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వ్యాపారాలు సాగక విసుగు చెందుతారు. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. అధికారులకు కింది స్థాయి సిబ్బందితో ఇబ్బందులు. ఉపాధి పథకాలు సంతృప్తినీయవు. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
యాదృచ్చికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. సన్నిహితుల సాయంతో సమస్య సానుకూలమవుతుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరొకదానికి వ్యయం చేస్తారు. శనివారం నాడు పనుల్లో ఒత్తిడి అధికం. మీ అసక్తతను కుటుంబీకులు అర్థం చేసుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. వ్యాపకాలు అధికమవుతాయి. గృహ మరమ్మతులు చేపడుతారు. కార్మికులు, చిన్నవ్యాపారులకు కష్టకాలం. హోల్‌సేల్ వ్యాపారులకు సామాన్యం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. విద్యాసంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. ఆకస్మిక ప్రయాణం తలపెడుతారు.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు, 1, 2, 3 పాదాలు
అర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు సామాన్యం. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. పదవుల కోసం యత్నాలు కొనసాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడుతాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టిపెడతారు. ఆది, సోమ వారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. అర్థాంతరంగా నిలిచిపోయిన పనులు పూర్తిచేస్తారు. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సంస్థల స్థాపనకు అనుకూలంకాదు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వాగ్దాటితో నెట్టుకొస్తారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ధనయోగం ఉంది. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆప్తులు సాయం అందిస్తారు. పరిచయాలు బలపడుతాయి. అవకాశాలను తక్షణం ఉపయోగించుకోండి. పనులు సావకాశంగా పూర్తిచేస్తారు. మంగళ, బుధ వారాల్లో అపరిచితులతో జాగ్రత్త. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలివేయండి. శుభ కార్యానికి యత్నాలు సాగిస్తారు. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాలలో ఆటుపోట్లను అధికమిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వాహనం ఇతరులకివ్వవద్దు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర, 1వ పాదం
అనుకూలతలున్నాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఖర్చులు సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. గురు, శుక్ర వారాల్లో పనుల్లో ఒత్తిడి అధికం. ముఖ్యల సందర్శనం వీలుపడదు. అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతాయి. యత్నాలు విరమించుకోవద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. గృహ మరమ్మతులు చేపడుతారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరకు నిల్వలో జాగ్రత్త. రిటైర్డు ఉద్యోగస్తులకు ధనయోగం. అధికారులకు హోదామార్పు. స్థానచలనం. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త, 1, 2 పాదాలు
పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మీ కార్యదీక్ష స్పూర్తిదాయకమవుతుంది. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పనులు అనుకున్న విధంగా పూర్తికాగలవు. శనివారం నాడు స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్యసేవలు అవసరం. ఆత్మీయుల రాక ధైర్యాన్నిస్తుంది.
సంతానం విషయాలలో శుభపరిణామాలున్నాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. వ్యాపారాలు స్వయంగా పుంజుకుంటాయి. నష్టాలు భర్తీ చేసుకోగల్గుతారు. ప్రస్తుత వ్యాపారాలే అనుకూలం. ఉద్యోగస్తులకు ఏమరుపాటు తగదు. వైద్య, కంప్యూటర్ రంగాలవారికి ఆదాయాభివృద్ధి.
 
తుల: చిత్త, 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్థిక లావాదేవీలు కొలిక్కి వస్తాయి. మానసికంగా కుదుటపడుతారు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చేతిలో ధనం నిలవదు. ఆది, సోమ వారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి. సంతానం చదువులపై దృష్టి పెడతారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. గృహ మార్పు అనివార్యం. ఆరోగ్యం సంతృప్తికరం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు  సంతృప్తినీయవు. ఉపాధి పథాకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తిచేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. మంగళ, బుధ వారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు పోవద్దు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను వదులుకోవద్దు. బాధ్యతగా వ్యవహరంచాలి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. ఉపాధ్యాయులకు పనిభారం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వాహన చోదకులకు దూకుడు తగదు. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఆందోళన తగ్గి కుదుటపడుతారు. అభియోగాలు, విమర్శలకు దీటుగా స్పందిస్తారు. మాట తీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. కొంత మొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. బంధుత్వాలు, వ్యాపకాలు అధికమవుతాయి. గురు, శుక్ర వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. పత్రాలు, నగదు జాగ్రత్త. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ఉపాధి పథకాల్లో పురోగతి అనుభవం గడిస్తారు. కార్మికులు, చేతి వృత్తులవారికి సామాన్యం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. చర్చలు, సమావేశాల్లో పాల్గొంటారు.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట, 1, 2 పాదాలు
కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. పంతాలకు పోవద్దు. ఓర్పుతో వ్యవహరించాలి. మిత సంభాషణ శ్రేయస్కరం. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. చేసిన పనులే చేయవలసి వస్తుంది. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. చెల్లింపుల్లో మెలకువ వహించండి. ఇంటి విషయాలపై మరింత శ్రద్ద అవసరం. కీలక సమాచారం సేకరిస్తారు. ఆలోచనలు చిరాకుపరుస్తాయి. వ్యాపకాలు సృష్టించుకోండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ముఖ్యులను కలుసుకుంటారు. పత్రాలు రెన్యువల్లో మెలకువ వహించండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. స్టాక్ మార్కెట్ పుంజుకుంటుంది. షేర్ల క్రయవిక్రయాలకు అనుకూలం.
 
కుంభం: ధనిష్ట 3,4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర, 1, 2, 3 పాదాలు
ఈ వారం ఆశాజనకం. శ్రమాధిక్యతో అనుకున్నది సాధిస్తారు. ధన లాభం, కుటుంబ సౌఖ్యం ఉన్నాయి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. గృహం సందడిగా ఉంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు కొనసాగిస్తారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. కాంట్రాక్టులు దక్కించుకుమంటారు. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. ఇతరుల బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెద్దల జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. స్థిరాస్థి దిశగా కొనుగోలుకు ఆలోచిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ప్రయాణం తలపెడతారు.
 
మీనం: పూర్వాబాద్ర,4 వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ మాటలకు తిరుగుండదు. ఎంతటివారైనా ఇట్టే ఆకట్టుకుంటారు. అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. బాధ్యతలు స్వీకరిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. డబ్బుకు ఇబ్బందిఉండదు. పనులు చురుకుగా సాగుతాయి. శని, ఆది వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. మీ శ్రీమతి సలహా పాటించండి. వాస్తుకు అనుగుణంగా గృహమార్పు శ్రేయస్కరం. ఆత్మీయులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది.