మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 15 ఆగస్టు 2020 (19:59 IST)

16-08-2020 నుంచి 22-08-2020 వరకూ మీ వార రాశిఫలితాలు - Video

మేషం: అశ్వని, భరణి, కృత్తిక, 1వ పాదం
ఎంత శ్రమించినా ఫలితం ఉండదు. ఆలోచనలు చికాకులు పరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఓర్పుతో వ్యవహరించండి. ఖర్చులు విపరీతం. దైవ కార్యానికి వ్యయం చేస్తారు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మంగళ, బుధ వారాల్లో పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. అపరిచితులతో మితంగా సంభాషించండి. బంధువులతో విభేదిస్తారు. మీ అభిప్రాయాలకు అభ్యంతరాలు ఎదురవుతాయి. మీ శ్రీమతి సలహా పాటించండి. సంతానం చదువులపై మరింత శ్రద్ద అవసరం. ప్రకటనలను, సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు వ్యాపారాభివృద్ధి. ఆప్తుల క్షేమం తెలుసుకుంటారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
అనుకూలత అంతంతమాత్రమే. ఆశావహ దృక్పథంతో మెలగండి. సహాయం ఆశించవద్దు. దుబారా ఖర్చులు విపరీతం. రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. గురు, శుక్ర వారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. వాగ్వాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. పెద్దల జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపకాలు అధికమవుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగస్తులకు ధన ప్రలోబం తగదు. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. జూదాల జోలికి పోవద్దు.
 
మిధునం: మృగశిర, 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు, 1, 2, 3 పాదాలు
ఈ వారం ఆశాజనకమే. పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. అవకాశాలు కలిసివస్తాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజ నకరం. దైవకార్యాలకు విపరీతంగా ఖర్చులు చేస్తారు. పనులు ముగింపు దశలో హడావిడిగా సాగుతాయి. సంప్రదింపులకు అనుకూలం. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. తొందరపడి హామీలివ్వద్దు. పెద్దల సలహా పాటించండి. గృహమార్పు కలిసివస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ప్రశాంతత, కుటుంబ సౌఖ్యం పొందుతారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. సరకు నిల్వలో జాగ్రత్త. రిటైర్డు ఉద్యోగస్తులకు రావలసిన ధనం అందుతుంది. విదేశాల నుంచి సంతా నం రాక ఉత్సాహాన్నిస్తుంది.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయం సంతృప్తికరం. అనుకున్న ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. మీ శ్రీమతికి అన్ని విషయీలు తెలియజేయండి. పనులు సకాలంలో పూర్తి కాగలవు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. అనవసర బాధ్యతలు చేపట్టవద్దు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. స్వల్ప అస్వస్థతకు గురౌతారు. అతిగా ఆలోచించవద్దు. విశ్రాంతి అవసరం. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయభివృద్ధి. ఆశావహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. కోర్టు వ్యవహారాలు, వివాదాలు కొలిక్కి వస్తాయి.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పెట్టుబడులపై దృష్టి పెడతారు. శనివారం నాడు ధన సహాయం తగదు. పనుల్లో చురుకుదనం లోపిస్తుంది. మీ నుంచి విషయ సేకరణకు కొంతమంది యత్నిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. ఇంటి విషయాలు ఏకరువువ పెట్టవద్దు. సంతానం కదలికలపై కన్నేసి ఉంచండి. చెప్పుడు మాటలకు ప్రాధాన్యం ఇవ్వవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇతరుల బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కొంటారు. ప్రియతముల ఆరోగ్యం కుదుటపడుతుంది. చిరువ్యాపారులకు ఆశాజనం. ఉపాధి శిక్షణావకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికం. దైవకార్యంలో పాల్గొంటారు.
 
కన్య: ఉత్తర, 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త, 1, 2 పాదాలు
అంచనాలు ఫలిస్తాయి. మీ నమ్మకం వమ్ముకాదు. విమర్శకులకు దీటుగా స్పందిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. బంధువులతో బంధుమిత్రుల మధ్య స్పర్థలు తొలుగుతాయి. ఆదాయం బావుంటుంది. దైవకార్యానికి వ్యయం చేస్తారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. మంగళ, బుధ వారాల్లో ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. పనులు సాగవు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. నిర్మాణాలకు ఆమోదం లభిస్తుంది. సంస్థల స్థాపనకు అనుకూలం. వ్యాపారాలలో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. చేతివృత్తుల వారికి ఆదాయాభివృద్ది. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదా మార్పు. జూదాలు, పందాలు జోలికి పోవద్దు.
 
తుల: చిత్త, 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఆశించిన పదవులు దక్కక పోవచ్చు. ఏది జరిగినా మంచికేనని భావించండి. యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. లావాదేవీలు కొలిక్కి వస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పత్రాలు నగదు జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ద వహించండి. బంధుత్వాలు, వ్యాపకాలు అధికమవుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గురు, శుక్ర వారాల్లో ఫోన్ సందేశాల పట్ల జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిన్న వ్యాపారులకు ఆదాయాభివృద్ది. ప్రయాణం విరమించుకుంటారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. ఎవరిని తప్పుపట్టవద్దు. సౌమ్యంగా సమస్యలు పరిస్కరించుకోవాలి. వ్యాపకాలు అధికమవుతాయి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. పనులు ముగింపు దశలో హడావిడిగా కొనసాగుతాయి. గృహమార్పు కలిసి వస్తుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. పత్రాలు రెన్యువల్లో మెలకువ వహించండి. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం చదువులపై శ్రద్ద వహించండి. గురు, శుక్ర వారాలలో ప్రైవేటు పాఠశాల
ఒత్తిడి అధికం. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొంటారు. సేవా, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. షేర్ల క్రయ, విక్రయాలకు అనుకూలం. దైవ దర్శనాలు ఉల్లాసం కలిగిస్తాయి.
 
ధనస్సు: మూల,పూర్వాషాడ, ఉత్తరాషాడ,1 వ పాదం
మనోధైర్యంతో వ్యవహరించండి. విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. యత్నాలకు సన్నిహిత ప్రోత్సాహం ఉంది. ఊహించని ఖర్చులే ఉంటాయి. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. శనివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. పెద్దల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బంధువులతో సంబంధాలు బలపడుతాయి. సంతానం ద్వారా శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. షాపు పనివారలతో జాగ్రత్త. పెద్ద మొత్తం నగదు అప్పగించవద్దు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదామార్పు. ఆకస్మిక స్థానచలనం. విందులు వినోదాల్లో అత్యుత్సాహం తగదు.
 
మకరం: ఉత్తరాషాడ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
రావలసిన ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. పెట్టుబడులకు తరుణం కాదు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సంప్రదింపులో తీరిక ఉండదు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. పనుల్లో ఒత్తిడి శ్రమ అధికం. ఆది, సోమ వారాలల్లో కొత్త సమస్సలెదురయ్యే సూచనలున్నాయి. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. విలువైన వస్తువులు, మరమ్మతుకు గురవుతారు. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. వృత్తుల వారికి ఆశాజనకం. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వృత్తి ఉపాధి పధకాల్లో రాణిస్తారు.
 
కుంభం: ధనిష్ట, 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర, 1, 2, 3 పాదాలు
గృహం సందడిగా ఉంటుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. మాటతీరుతో ఆకట్టుకుంటారు. ఆదాయం బాగుంటుంది. వేడుకను ఘనంగా చేస్తారు. కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. మంగళ, బుధ వారాల్లో జాగ్రత్త. పెద్దల ఆరోగ్యం మెరుగు పడుతుంది. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఇరువర్గాల వారు మీ సలహా పాటిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. పదవులు, బాధ్యతల నుండి తప్పుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు మున్ముందు సత్పలితాలిస్తాయి. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మీనం: పూర్వాబాద్ర, 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
పరిస్థితులు అనుకూలిస్తాయి. కొంత మొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. గృహంలో స్తబ్దత తొలగుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. పనులు సానుకూలమవుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. గురు, శుక్ర వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. పత్రాలు రెన్యువల్లో మెలకువ వహించండి. చెల్లింపులు వాయిదా వెయ్యెద్దు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతారు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. కార్మికులకు నిరాశాజనకం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. సంస్థల స్థాపనకు అనుకూలం. ఉద్యోగస్తుల ప్రశంసలందుకుంటారు. ఉపాధి పథకాలు పురోగతిన సాగుతాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడుతారు.