సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Modified: శనివారం, 1 ఆగస్టు 2020 (21:07 IST)

02-08-2020 నుంచి 08-08-2020 వరకు మీ వార రాశి ఫలితాలు- Video

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
కార్యసిద్ధి ఉంది. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. ప్రణాళిక రూపొందించు కుంటారు. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. సంప్రదింపులు అనుకూలం. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. అనాలోచితంగా వ్యవహరించవద్దు. గురు, శుక్ర వారాలల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. నిర్మాణాలు మరమ్మతులు చేపడుతారు. నోటీసులు అందుకుంటారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. అధికారులకు ఒత్తిడి, పనిభారం. వేడుకల్లో పాల్గొంటారు.
 
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు, రోహిణి,మృగశిర, 1, 2 పాదాలు
ఆర్థికస్థితి నిరాశాజనకం. రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు. ఆలోచనలతో సతమవుతారు. ఖర్ఛులు అదుపులో ఉండవు. సన్నిహితుల సాయం అందుతుంది. ఒక సమస్య నుంచి బయట పడుతారు. శనివారం నాడు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పిల్లల ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు స్థాన చలనం. ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాలలో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి.
 
మిధునం: మృగశిర, 3,4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు, 1,2,3 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. కొన్ని సమస్యల నుండి బయటపడుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఖర్చులు అధికం. సంతృప్తికరం, రావలసిన ధనం అందుతుంది. ఆప్తులకు సాయం అందిస్తారు. ఆది, సోమ వారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. బంధుత్వాలు బలపడుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. మీ సాయంతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ వారం అనుకూలదాయకమే. కొన్ని అవకాశాలు అనుకోకుండా కలిసివస్తాయి. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. పరిచయాలు బలపడుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. మంగళ, బుధ వారాల్లో ధన సహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. పనులు సానుకూలమవుతాయి. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. ఏజెన్సీలు, దళారులను విశ్వసించవద్దు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపుచేయండి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. నూతన వ్యాపారాలు, సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం, కోర్టు వాయిదాలకు హాజరవుతారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. రావలసిన ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేటు సంస్థలో మదుపు తగదు. ఉల్లాసంగా గడుపుతారు. పనులు వేగవంతమవుతాయి. అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. పెద్దల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. గురువారం నాడు పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. నూతన వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు ఒత్తిడి అధికం. వేడుకలకు హాజరవుతారు.
 
కన్య: ఉత్తర, 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త. 1, 2 పాదాలు
అన్ని రంగాలవారికి ఆశాజనకమే. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. అవకాశాలు కలిసి వస్తాయి. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పనులు వేగవంతమవుతాయి. శుక్ర, శని వారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. అపరిచితులు మోసగించేందుకు యత్నిస్తారు. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. న్యాయ, వైద్య రంగాల వారికి పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వాహన చోదకులకు దూకుడు తగదు.
 
తుల: ; చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2, 3 పాదాలు
ఈ వారం సంతోషదాయకం. శుభవార్తలు వింటారు. మనస్సుకు నచ్చిన వారితో పరిచయాలేర్పడుతాయి. ప్రణాళికలు రూపొందించుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు విపరీతం. ఉల్లాసంగా గడుపుతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ద అవసరం. విశ్రాంతి అవసరం. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. వేడుకలకు సన్నహాలు సాగిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. రిటైర్డు ఉద్యోగస్తులకు రావలసిన ధనం అందుతుంది. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. వృత్తిపరంగా ఎదురైన తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఆత్మీయుల క్షేమం ఉపశమనం కలిగిస్తుంది. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
 
వృశ్చికం: విశాఖ, 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. సాధ్యం కాని హామీలివ్వద్దు. పెద్దల సలహా పాటించండి. దంపతుల మధ్య దాపరికం తగదు. ఒక సమాచారం ఆలోచింప జేస్తుంది. పనులు హడావిడిగా సాగుతాయి. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. సంతానం ఉన్నత చదువులపై శ్రద్ధ అవసరం. ప్రకటనలను, దళారులను విశ్వసించవద్దు. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కొనుగోలుదార్లతో ఇబ్బందులెదురవుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ, 1 వ పాదం
యాదృచ్చికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. వివాదాలకు దూరంగా ఉండాలి. అపరిచితులతో జాగ్రత్త. డబ్బుకు ఇబ్బంది లేకున్నా సంతృప్తి ఉండదు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆది, సోమ వారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. కనిపించకుండాపోయిన పత్రాలు లభిస్తాయి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిరు వ్యాపారాలకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు ధనప్రలోభం తగదు. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ధనాభివృద్ధి. ప్రయాణం నుకూలించదు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
మకరం: ఉత్తరాషాడ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట,1, 2 పాదాలు
అనుకూలం అంతంతమాత్రమే. పట్టుదలతో వ్యవహరించాలి. అవకాశాలు చేజారిపోతాయి. పొగిడే వారితో జాగ్రత్త. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. ఖర్చులు అదుపులో ఉండవు. రాబడిపై దృష్టి పెడతారు. బుధవారం నాడు పనులు సాగవు. ప్రముఖుల కలయిక సాధ్యంకాదు. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. సంతానం విజయం సంతృప్తినిస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. ఆందోళన తొలగి కుదుటపడతారు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. కోర్టు వ్యవహారాలు ముందుకు సాగవు.
 
కుంభం: ధనిష్ట, 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అన్నిరంగాల వారికి ఆశాజనకం. సమస్యల నుంచి బయటపడతారు. బంధుత్వాలు బలపడుతాయి. గృహంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఆదాయం సంతృప్తికరం. కొంత మొత్తం పొదుపు చేస్తారు. గురు, శుక్ర వారాల్లో పెద్దమొత్తం ధనసహాయం తగదు. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. పనులు చురుకుగా సాగుతాయి. వ్యవహారాలతో తలమునకలవుతారు. పెద్దల సలహా పాటించండి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. సన్నిహితుల సాయం అందుతుంది. నిర్మాణాలు, మరమ్మతులు ముగింపునకొస్తాయి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. వ్యాపారాలలో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. ప్రశంసలందుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వైద్య రంగాల వారికి ఆదాయాభివృధ్ధి.
 
మీనం: పూర్వాబాద్ర, 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సమర్దత చాటుకుంటారు. పదవులు వరిస్తాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. సాధ్యంకాని హామీలివ్వద్దు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. మీ సలహా ఎదుటివారికి కలిసివస్తుంది. శనివారం నాడు పనులు హడావిడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సన్నిహితులకు సాయం అందిస్తారు. బంధువుల రాకపోకలు అధిక మవుతాయి. విలువైన వస్తువులు కనిపించవు. ఎవరినీ అనుమానించవద్దు. స్థిమితంగా ఉండడానికి యత్నించండి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ఉపాధ్యాయులకు స్థానచలనం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెద్ద మొత్తం సరకు నిల్వలో జాగ్రత్త. కీలక సమావేశాల్లో ప్రముఖంగా పాల్గొంటారు.