సోమవారం, 13 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 6 జూన్ 2020 (22:19 IST)

07-06-2020 నుంచి 13-06-2020 వరకు మీ వార రాశి ఫలితాలు- video

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం  
పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటారు. ఒత్తిడి, శ్రమ అధికం. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. పనుల సానుకూలమవుతాయి. ఖర్చులు అదుపులో వుండవు. సోమ, మంగళవారాల్లో ఆకస్మిక ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. మీ పథకాలు మునుముందు సత్ఫలితాలనిస్తాయి. సరుకు నిల్వల్లో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ఆప్తులకు వీడ్కోలు పలుకుతారు. వాహనచోదకులకు దూకుడు తగదు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2పాదాలు
వ్యవహారానుకూలత వుండదు. మీ మాటతీరును కొంతమంది తప్పుబడతారు. ఆలోచనలు చికాకు పరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి వుండదు. దుబారా ఖర్చులు విపరీతం. బుధవారం నాడు పనుల్లో ఒత్తిడి అధికం. బ్యాంకు వ్యవహారాల్లో మెలకువ వహించండి. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. గృహంలో మార్పులు చేర్పులకు అనుకూలం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉపాధ్యాయులకు శ్రమ అధికం. అధికారులకు హోదామార్పు స్థానచలనం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరు వ్యాపారులకు ఆశాజకనం. దూరాన వున్న సంతానం యోగక్షేమాలు తెలుసుకుంటారు.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు  
కార్యసాధనకు మరింత శ్రమించాలి. అవకాశాలు చేజారిపోతాయి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. మాటతీరు అదుపులో వుంచుకోండి. దుబారా ఖర్చులు విపరీతం. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. సాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. గురు, శుక్రవారాల్లో నగదు, వస్తువులు జాగ్రత్త. బ్యాంకు వ్యవహారాల్లో మెలకువ వహించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం పై చదువులపై దృష్టి పెడతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. న్యాయ, సేవ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ట్రావెలింగ్ రంగాల వారికి ఆదాయం. రిటైర్డ్ ఉద్యోగులకు వీడ్కోలు పలుకుతారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. అవకాశాలను దక్కించుకుంటారు. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. అర్థాంతంగా నిలిపివేసిన పనులు పునః ప్రారంభమవుతాయి. బాధ్యతలు ఇతరులకు అప్పగించవచ్చు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. అపరిచితులతో జాగ్రత్త. శనివారం నాడు ఊహించని సంఘటనలెదురవుతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. పెద్దల ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. సంతానం పై చదువులపై దృష్టి పెడతారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం  
ఆర్థికంగా పర్వాలేదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. ఆలోచనలు చికాకుపరుస్తాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఖర్చులు అదుపులో వుండవు. కొంత మొత్తం ధనం అందుతుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆది, సోమవారాల్లో వ్యతిరేకులతో జాగ్రత్త. సన్నిహితుల సలహా పాటించండి. దంపతుల మధ్య దాపరికం తగదు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ప్రియతముల ఆరోగ్యం కుదుటపడుతుంది. నోటీసులు అందుకుంటారు. బ్యాంకు వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక వుండదు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు  
కార్యం సిద్ధిస్తుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ ప్రమేయంతో వివాదం సద్దుమణుగుతుంది. ఆత్మీయులకు చక్కని సలహాలిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అతిగా శ్రమించవద్దు. విశ్రాంతి అవసరం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. లాభనష్టాలు సమీక్షించుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. మీ తప్పిదాలు సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ వారం అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధననష్టం అధికం. చిన్న విషయమే ఆందోళన కలిగిస్తుంది. సంప్రదింపులు ముందుకు సాగవు. పట్టుదలతో వ్యవహరించాలి. ఆత్మీయులను కలుసుకుంటారు. సంతానం భవిష్యత్తుపై దృష్టిపెడతారు. బ్యాంకు పనుల్లో ఒత్తిడి అధికం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సలహాలు, సహాయం ఆశించవద్దు. స్వయం కృషితోనే రాణిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. ఉన్నతాధికారులు పదవులు స్వీకరిస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృత్తిల వారికి నిరుత్సాహకరం. ప్రియతముల క్షేమ సమాచారం తెలుసుకుంటారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 
కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. బంధువుల వ్యాఖ్యలకు ధీటుగా స్పందిస్తారు. ఆదాయం సంతృప్తికరం. కొంత మొత్తం ధనం అందుతుంది. ఖర్చులు అదుపులో వుండవు. బుధవారం నాడు నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం స్వయంగా చూసుకోవాలి. పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పిల్లల పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. అధికారులకు హోదామార్పు, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వాహనం ఇతరులకు ఇవ్వవద్దు.
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ఆర్థికంగా ఫర్వాలేదు. తెలియని వెలితి వెంటాడుతుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంపై ఆసక్తి వుండదు. సంప్రదింపులతో తీరిక వుండదు. ఏ విషయాన్ని తెగే వరకు లాగొద్దు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. గురు, శుక్రవారాల్లో కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆప్తులను కలుసుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. పత్రాలు అందుకుంటారు. బ్యాంకు వ్యవహారాల్లో మెలకువ వహించండి. చెల్లింపుల్లో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. దూరాన వున్న సంతానం ఇంటికి చేరుకుంటారు. 
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు  
అనుకున్నది సాధిస్తారు. మీ కార్యదీక్ష స్ఫూర్తిదాయకమవుతుంది. ప్రశంసలందుకుంటారు. బంధుత్వాలు బలపడతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. పెట్టుబడులకు తరుణం కాదు. శని, ఆదివారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. వ్యాపకాలు, బాధ్యతలు అధికమవుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్య సేవలు అవసరం. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రయాణానికి సన్నాహాలు సాగిస్తారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు  
వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ సలహా ఎదుటివారికి కలిసివస్తుంది. అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. సోమ, మంగళవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. చెల్లింపులు, పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. సంతానం పై చదువులపై దృష్టి పెడతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. వృత్తి ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
ఆదాయం బాగుంటుంది. రుణ బాధలు తొలగుతాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. బుధ, గురువారాల్లో అనవసర జోక్యం తగదు. అపరిచితులతో జాగ్రత్త. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. ప్రియతముల క్షేమం ఉపశమనం కలిగిస్తుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. రిటైర్డ్ ఉద్యోగులకు వీడ్కోలు పలుకుతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి.