శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 16 మే 2020 (18:38 IST)

17-05-2020 నుంచి 23-05-2020 వరకు మీ వార రాశి ఫలితాలు-video

Weekly Horoscope
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం  
ప్రతికూలతలు తొలగుతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఖర్చులు అదుపులో వుండవు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. వ్యాపకాలు సృష్టించుకుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. గురు,శుక్రవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ అవసరం. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. ప్రయాణం వాయిదా పడుతుంది. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2పాదాలు  
వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఆచితూచి వ్యవహరించాలి. ఎవరినీ తక్కువగా అంచనా వేయొద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. మీ అభిప్రాయాలకు అభ్యంతలెదురవుతాయి. శనివారం నాడు ఖర్చులు విపరీతం. చేతిలో డబ్బు నిలవదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం సంతృప్తికరం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడుతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఆధ్యాత్మిక పెంపొందుతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. సంస్థల స్థాపనలకు అనుకూలం. విదేశాల్లోని సంతానం క్షేమం తెలుసుకుంటారు. 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు  
ఈ వారం పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. సంప్రదింపులు అనుకూలం. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. తప్పటడుగు వేసే ఆస్కారం వుంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. కొంత మొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. పదవులు దక్కకపోవచ్చు. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష  
అనుకున్నది సాధిస్తారు. ధనయోగం, కుటుంబ సౌఖ్యం వున్నాయి. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. బాధ్యతలు అధికమవుతాయి. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. పెద్ద మొత్తం ధనసహాయం తగదు. సంతానం దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. ఆలోచనలు పలువిధాలుగా వుంటాయి. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరినీ తక్కువగా అంచనా వేయవద్దు. వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. సేవ, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం  
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. ఖర్చులు సంతృప్తికరం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. పనులు హడావుడిగా సాగుతాయి. పత్రాలు అందుకుంటారు. ఆది, సోమవారాల్లో ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. అధికారులకు వీడ్కోలు పలుకుచారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ప్రయాణానికి సన్నాహాలు సాగిస్తారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు  
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. యత్నాలు విరమించుకోవద్దు. సన్నిహితుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. ఖర్చులు అదుపులో వుండవు. ధనసమస్యలెదురవుతాయి. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. మంగళ, బుధవారాల్లో పనులతో సతమతమవుతారు. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోవాలి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం వుంది. న్యాయ, నోటీసులు అందుకుంటారు. న్యాయ, సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. నూతన వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. హోల్ సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలు అధికం. ప్రయత్నాలు సాగక నిరుత్సాహం చెందుతారు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. మీపై ఇతరుల వ్యాఖ్యల ప్రభావం అధికం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహా పాటించండి. దూకుడుగా వ్యవహరించవద్దు. ఖర్చులు విపరీతం. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. మీ శ్రీమిత వైఖరిలో మార్పు వస్తుంది. మనోధైర్యంతో వ్యవహరిస్తారు. గురు, ఆదివారాల్లో అపరిచితులతో జాగ్రత్త. అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీ చూడనట్లు వదిలేయాలి. విద్యార్థుల ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. పట్టుదలతో ఉద్యోగయత్నం సాగించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు నిరాశాజనకం. వాహనచోదకులకు దూకుడు తగదు.  
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 
వ్యవహారానుకూలత ఉంది. తెలివిగా వ్యవహరిస్తారు. కొంతమొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. సమస్యలు నిదానంగా సద్దుమణుగుతాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. శుక్ర, శనివారాల్లో పరిచయస్తులతో విభేదాలు తలెత్తుతాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వ్యాపకాలు అధికమవుతాయి. సంతానం క్షేమం తెలుసుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లు దొర్లే ఆస్కారం వుంది. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటానికి యత్నించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వ్యాపకాలు అధికమవుతాయి. సంతానం క్షేమం తెలుసుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లు దొర్లే ఆస్కారం వుంది. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటానికి యత్నించండి. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ప్రయాణం తలపెడతారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం 
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. పెట్టుబడులకు తరుణం కాదు. పరిచయాలు బలపడతాయి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. సోమ, మంగళవారాల్లో బ్యాంకుల్లో పనులు సాగక విసుగు చెందుతారు. చెల్లింపులు, పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. ఆత్మీయుల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు ముందుకు సాగవు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. అధికారులకు పనిభారం. విశ్రాంతి లోపం. రిటైర్డ్ ఉద్యోగస్తులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకోగలుగుతారు. 
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు  
కొత్త సమస్యలెదురవుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఒత్తిడి, ఆందోళన అధికం. స్థిమితంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆఫ్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ఖర్చులు విపరీతం. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి వుంటుంది. బుధవారం నాడు పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. బంధువుల మాటతీరు మనస్తాపం కలిగిస్తుంది. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. విద్యాప్రకటనలు విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు  
పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతాయి. విమర్శించిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే వుంటాయి. గురు, శుక్రవారాల్లో పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. అవకాశాల కోసం ఎదురుచూడవద్దు. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి. బ్యాంకు వివరాలను వెల్లడించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. వాహనం, గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. భాగస్వామిక చర్చలు పురోగతిన సాగుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. అధికారులకు హోదా మార్పు, ఆకస్మిక స్థానచలనం.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ధనలాభం, కుటుంబ సౌఖ్యం పొందుతారు. పనులు సానుకూలమవుతాయి. మీ జోక్యం అనివార్యం. ఎవరినీ నొప్పించవద్దు. లౌక్యంగా వ్యవహరించాలి. మీ సలహా ఎదుటివారికి కలిసివస్తుంది. శని, ఆదివారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఏజెన్సీలు, దళారులను విశ్వసించవద్దు. ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. పెట్టుబడులకు అనుకూలం కాదు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వాహనం ఇతరులకివ్వవద్దు.