మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : ఆదివారం, 9 ఆగస్టు 2020 (12:54 IST)

09-08-2020 నుంచి 15-08-2020 వరకు మీ వార రాశి ఫలితాలు - video

మేషం: అశ్వని, భరణి, కృత్తిక, 1 వ పాదం
వ్యవహారాలతో తలమునకలవుతారు. పంతాలు, భేషజాలకు పోవద్దు. లౌక్యంగా వ్వవహరించాలి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఆది, గురు వారాల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. పెద్దల జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింప చేస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. నిర్మాణాలు, మరమ్మతులు చేపడుతారు. కొత్త పరిచయాలేర్పడుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం.
 
వృషభం: కృత్తిక 2, 3 ,4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. ఆలోచనలతో సతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆప్తుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. డబ్బుకు ఇబ్బందిగా ఉంటుంది. అవసరాలు, చెల్లింపులు వాయిదా పడుతాయి. సోమ, మంగళ వారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ అవసరం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కనిపించకుండా పోయిన వస్తవులు లభ్యమవుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరువ్యాపారులకు నిరాశాజనకం. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. అధికారులకు పనిభారం. విశ్రాంతి లోపం. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మిధునం: మృగశిర, 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రణాళిక రూపొందించుకుంటారు. కార్యసిద్ది, వాహనయోగం ఉన్నాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. ఖర్చులు విపరీతం. కొన్ని వ్యవహారాలు ధనంతో ముడిపడి ఉంటాయి. బుధవారం నాడు చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు హడావిడిగా సాగుతాయి. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆరోగ్యం మెరుగు పడుతుంది. బంధు మిత్రులనుకలుసుకుంటారు. సంస్థల స్థాపనకు అనుకూలం. సంతానం చదువులపై శ్రద్ద అవసరం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, విశ్రాంతి లోపం. వృత్తిపరమైన ఆటంకాలను అధిగమిస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ దర్శనాలు సంతృప్తినిస్తాయి.
 
కర్కాటకం: పునర్వసు, 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఖర్చులు అధికం ప్రయోజనకరం. ధనలాభం ఉంది. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. గురు, శుక్ర వారాల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. నిర్మాణాలు, మరమ్మతులు చేపడుతారు. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం పైచదువులను వారి ఇష్టానికే వదిలివేయండి. ఉద్యోగస్తులకు పదవీయోగం. ధనలాభం. సహోద్యోగులతో వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిరువ్యాపారులకు ఆశాజనకం. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు మధ్య సాగుతుంది.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. చాకచక్యంగా మెలగాలి. సలహాలు, సహాయం ఆశించవద్దు. ఆదాయం సంతృప్తికరం. రుణ సమస్యలు తొలగుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. శనివారంనాడు పనులు సాగవు. బంధుమిత్రులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియచేయండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. సంతానం విజయ ఉత్సాహానిస్తుంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ప్రయాణం కలిసివస్తుంది.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త, 1, 2 పాదాలు
తప్పిదాలను సరిదిద్దుకుంటారు. బంధుమిత్రులకు మీపై ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. గృహం సందడిగా ఉంటుంది. కొత్తపనులు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఆది, సోమ వారాల్లో కొత్త సమస్యలు ఎదురయ్యే ఆస్కారముంది. అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పెద్దల సలహా పాటించండి. ఇంటి విషయాలపై మరింత శ్రద్ద అవసరం. ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతుంది. ఆప్తులను కలుసుకుంటారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. పెద్ద మొత్తం సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. సేవా, దైవకార్యాలలో పాల్గొంటారు. వాహనం ఇతరులకివ్వవద్దు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ, 1, 2, 3 పాదాలు
అనుకూలతలున్నాయి. పదవుల కోసం యత్నిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. భేషజాలకు పోవద్దు. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనులు చురుకుగా సాగుతాయి. ఆది, సోమ వారాల్లో శ్రమాధిక్యత, అకాల భోజనం, వ్యవహారాలతో తీరిక ఉండదు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ అవసరం. గృహ మార్పు కలిసి వస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. విమర్శలకు దీటుగా స్పందిస్తారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడుతారు. సరకు నిల్వలో జాగ్రత్త. వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. మార్కెట్టు రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
యాదృచ్చికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. సంప్రదింపులు ముందుకు సాగవు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. బుధ, గురు వారాల్లో ఆలోచనలతో సతమవుతారు. ఏ పని చేయబుద్ది కాదు. సన్నిహితుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. పోగొట్టుకున్న వస్తవులు లభ్యమవుతాయి. గృహ మార్పు అనివార్యం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. అవసరాలు అతి కష్టంమీద నెరవేరుతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆశావహ దృక్పథంతో మెలగండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ, 1వ పాదం
మీ సమర్దతపై నమ్మకం పెంచుకోండి. కృషి ఫలించకున్నా యత్నించామన్న సంతృప్తి ఉంటుంది. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. కొంతమొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. శుక్ర, శని వారాల్లో పనులు సాగక విసుగు చెందుతారు. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు బలపడుతాయి. ఆందోళన కలిగంచిన సమస్య సద్దుమణుగుతుంది. సంతానం ద్వారా శుభవార్త వింటారు. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మకరం: ఉత్తరాషాడ, 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
ఈ వారం కొంతమేరకు అనుకూలమే. తప్పిదాలను సరిదిద్దుకుంటారు. సమస్యలు సద్దుమణుగుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. బాధ్యతలు, పనులు అప్పగించవద్దు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. పెద్దల సలహా పాటించండి. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. గృహమార్పు కలిసివస్తుంది. ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు. అధికారుల తీరును గమనించి మెలగండి. న్యాయ, వైద్య, సేవారంగాల వారికి ఆదాయభివృద్ధి. విదేశాలలోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.
 
కుంభం: ధనిష్ట, 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పదవులు అందుకుంటారు. పరిచయాలు బలపడుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ప్రత్యర్థుల కదలికలను గమనిస్తుండాలి. ఆదాయం బాగుంటుంది. ఆలయాలు, ధార్మిక సంస్థలకు విరాళాలు అందిస్తారు. పనులు సానుకూలమవుతాయి. పత్రాలు రెన్యువల్లో మెలకువ వహించండి. అనవసర జోక్యం తగదు. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఏజెన్సీలు మధ్యవర్తులను విశ్వసించవద్దు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి సలహా పాటించండి. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. పెట్టుబడులకు అనుకూలం. ఉపాధ్యాయుల కృషి ఫలిస్తుంది. పురస్కాకారాలు అందుకుంటారు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. స్పెక్యులేషన్ రంగాల వారికి నిరాశాజనకం.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
బాధ్యతగా వ్యవహరించాలి. సాధ్యం కాని హామీలివ్వద్దు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. వ్యవహార ఒప్పందాల్లో జాగ్రత్త. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్ద ఖర్చులు తగిలే సూచనలున్నాయి. ఆది, సోమ వారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం, ఆలోచనల్లో మార్పు వస్తుంది. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు. అధికారులకు అదనపు బాధ్యతలు, వ్యాపారాభివృద్ధి పథకాలు రూపొందిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. రిప్రెజెంటేటివ్‌లకు ఆదాయాభివృద్ధి. పుణ్యకార్యంలో పాల్గొంటారు.