గురువారం, 21 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 22 ఆగస్టు 2020 (21:55 IST)

23-08-2020 నుంచి 29-08-2020 వరకు మీ వార రాశి ఫలితాలు-video

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతాయి. ఆశావహ దృక్పథంతో మెలగండి. నిరుత్సాహపడవద్దు. యత్నాలు కొనసాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పరిచయాలు బలపడుతాయి. శని, ఆది వారాల్లో పనులు సాగవు. కుటింబీకులు మీ అసక్తతను అర్థం చేసుకుంటారు. బాధ్యతలు అప్పగించవద్దు. ఆత్మీయుల గురించి ఆందోళన చెందుతారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీ శ్రీమతికి ప్రతి విషయం తెలియజేయండి. నోటీసులు అందుకుంటారు. సన్నిహితుల సలహా పాటించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. షాపుల స్థలమార్పు అనివార్యం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు పనిభారం. విశ్రాంతి లోపం.
 
వృషభం: అశ్వని, 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర, 1, 2 పాదాలు
ఆందోళన తగ్గి కుదుటపడుతారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. ఇంటి విషయాలపై శ్రద్ధ అవసరం. సోమ, మంగళ వారాల్లో ముఖ్యుల సందర్శనం వీలు పడదు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. కార్మికులు, చేతివృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. జూదాలు, పందాల జోలికి పోవద్దు.
 
మిధునం: మృగశిర, 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు, 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. తొందరపాటు నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. శుభకార్యానికి యత్నాలు కొనసాగిస్తారు. ఒక సమాచారం ఆలేచింపజేస్తుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పరిచయాలు బలపడుతాయి. బుధ, గురు వారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పనులు బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. పాఠశాలల నుంచి ఒత్తిడి అధికం. ఉద్యోగస్తులకు శుభవార్త శ్రవణం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. సంస్థల స్థాపనలకు సమయం కాదు. ఉపాధి పథకాలు సంతృప్తికరంగా సాగుతాయి. కార్మికులు, వృత్తుల వారికి సామాన్యం. వాహనం ఇతరులకివ్వద్దు.
 
కర్కాటకం: పునర్వసు, 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అనురాగ వాత్సల్యాలు వెల్లువిరుస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బందులుండవు. శుక్ర, శనివారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మీ ప్రమేయంతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ సలహా ఎదుటివారికి కలిసివస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం ఉపయోగించుకోండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. నిర్మాణాలు, మరమ్మతులు వేగవంతమవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర, 1వ పాదం
ఈ వారం కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. రుణ సమస్యల నుంచి విముక్తులవుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. పనులు హడావిడిగా సాగుతాయి. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. సంస్థల స్థాపనకు అనుకూలం. నగదు, పత్రాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఆశావహ దృక్పథంతో ఉద్యోగ యత్నం సాగించండి. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వేడుకలు వినోదాల్లో అత్యుత్సాహం తగదు.
 
కన్య: ఉత్తర, 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త, 1, 2 పాదాలు
మాట నిలబెట్టుకుంటారు. ఎదుటివారికి మీపై గురి కుదురుతుంది. బాధ్యతలు స్వీకరిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసవస్తవులు కొనుగోలు చేస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. సంస్థల స్థాపనలకు అనుకూలం. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. విద్యాసంస్థలకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాలలో పురోభివృద్ధి సాధిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు కొత్త బాధ్యతలు, స్థానచలనం. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు.
 
తుల: చిత్త, 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాల భోజనం. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. సన్నిహితుల సలహా పాటించండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. ఆదాయం సంతృప్తికరం. డబ్బుకు ఇబ్బందులుండవు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆది, సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. సంస్థల స్థాపనకు తరుణం కాదు. పత్రాలు అందుకుంటారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఆధ్యాత్మికత పెపొందుతుంది. కార్మికులు, చేతివృత్తుల వారికి సామాన్యం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సరకు నిల్వలో జాగ్రత్త. స్టాక్ మార్కెట్ రంగాలవారికి ఆశాజనకం. దైవకార్య సమావేశంలో పాల్గొంటారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
కొన్ని విషయాలు మీరనుకున్నట్టే జరుగుతాయి. సమయస్పూర్తితో వ్యవహరించాలి. ఏక పక్షంగా వ్యవహరించవద్దు. పెద్దల సలహా పాటించండి. మంగళ, బుధ వారాల్లో ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఇంటి విషయాల పట్ల శ్రద్ద అవసరం. పరిస్థితుల అనుకూలత అంతంతమాత్రమే. దంపతుల మధ్య దాపరికం తగదు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాభివృద్ధికి పథకం రూపొందిస్తారు. చిన్న వ్యాపారులు, కార్మికులకు నిరుత్సాహం. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ, 1వ పాదం
కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనవున్నాయి. అప్రమత్తంగా ఉండాలి. సంప్రదింపులు ముందుకు సాగవు. ఆలోచనలతో సతమవుతారు. గురు, శుక్ర వారాల్లో డబ్బుకు ఇబ్బందిగా ఉంటుంది. సాయం చేసేందుకు అయినవారే వెనకాడుతారు. అవసరాలు అతి కష్టంమీద నెరవేరుతాయి. కుటుంబీకులు మీ అసక్తతను అర్థం చేసుకుంటారు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మనోధైర్యంతో ముందుకు సాగండి. ఈ చికాకులు సమస్యలు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు చక్కబడుతాయి. గృహ మరమ్మతులు చేపడుతారు. ఆరోగ్యం జాగ్రత్త. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. రిటైర్డు ఉద్యోగులకు రావలసిన ధనం అందుతుంది. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
మకరం: ఉత్తరాషాడ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అనుకూలతలు అంతంతమాత్రమే. అవకాశాలు చేజారిపోతాయి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. నమ్మకస్తులే వంచించేందుకు యత్నిస్తారు. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఖర్చులు సామాన్యం. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. శనివారం నాడు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు ఏమంత స్పందన ఉండదు. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికం. అధికారులకు కొత్త బాధ్యతలు, పనిభారం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. హోల్ సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఆశించిన కాంట్రాక్టులు దక్కవు. విదేశాల్లోని సంతానం క్షేమం తెలుసుకుంటారు.
 
కుంభం: ధనిష్ట, 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర, 1, 2, 3 పాదాలు
అన్నిరంగాల వారికి యోగదాయకమే. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ధన లాభం, వస్త్ర ప్రాప్తి ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి. ఆది, సోమ వారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. వ్యాపకాలు అధికమవుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. నూతన వ్యాపారాలు, సంస్థల స్థాపనకు సన్నాహాలు సాగిస్తారు. కార్మికులు, చేతివృత్తుల వారికి సామాన్యం. ఉద్యోగస్తులుఅధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ద్విచక్ర వాహన చోదకులకు దూకుడు తగదు.
 
మీనం: పూర్వాబాద్ర, 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఖర్చులు సామాన్యం. ఆందోళన తగ్గి కుదుటపడుతారు. పనులు సానుకూలమవుతాయి. మంగళ, బుధ వారాల్లో అపరిచితులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. పత్రాలు అందుకుంటారు. సంతాన విషయాల్లో శుభాలున్నాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. గృహంలో మార్పుచేర్పులు సత్ఫలితాలిస్తాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. వ్యాపారాభివృద్దికి మరింత శ్రమించాలి. షాపు పనివారలతో జాగ్రత్త. ఉద్యోగస్తుల సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వైద్య రంగాల వారికి ఆదాయాభివృధ్ధి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.