శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

28-08-2020 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవికి అభిషేకం చేసి కుంకుమార్చన చేస్తే..

మేషం : మీ రాక బంధువులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం దూర ప్రాంతాలకు వెళ్లవలసి ఉంటుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతుల్లో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. 
 
వృషభం : ఇతరులు మీ దృష్టిని మరల్చేందుకు యత్నిస్తారు. వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు ఎదుర్కొంటారు. ఖర్చులు, చెల్లింపులకు సార్థకత ఉంటుంది. అప్రయత్నంగా కొన్ని వ్యవహారాలు కలిసిరాగలవు. 
 
మిథునం : ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు. భాగస్వామిక, సొంత వ్యాపారాలలో ఏకాగ్రత అవసరం. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేయవలసి ఉంటుంది. ఉన్నత స్థాయి అధికారులకు కింది స్థాయి సిబ్బందితో ఇబ్బందులు తప్పవు. 
 
కర్కాటకం : మీ యత్నాలకు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. లీజు, ఏజెన్సీలు నూతన టెండర్ల వ్యవహారాల్లో పునరాలోచన అవసరం. వాతావరణం అనుకూలించడంతో వ్యవసాయ పనులు ఊపందుకుంటాయి. పత్రికా, వార్తా, మీడియా వారికి ఊహించని సమస్యలెదురవుతాయి. చీటికి మాటికి ఎదుటివారిపై అసహనం ప్రదర్శిస్తారు. 
 
సింహం : వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ వ్యాపారులకు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం క్షేమదాయకం. కొంతమంది మన పలుకుపడిని దుర్వినియోగం చేయడం వల్ల మాటపడవలసి వస్తుంది. ఊహించని ఖర్చుల వల్ల స్వల్ప ఆటుపోట్లను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. 
 
కన్య : దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. చిట్స్,  పైనాన్స్, వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు. చిన్నతరహా పరిశ్రమలు, చిరువ్యాపారులకు కలిసిరాగలదు. విద్యార్థులకు నూతన వాతావణం ఆందోళన కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ అధికారుల నుంచి అభ్యంతరాలెదుర్కోవలసి వస్తుంది. 
 
తుల : చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు. ఖర్చులు పెరిగినా మీ అవసరాలకు కావలసిన ధనం సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తులు, సమర్థంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. 
 
వృశ్చికం : సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. బంధువులపై మీరు పెట్టుకున్న ఆశలు అడియాశలవుతాయి. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. కీలకమైన వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. 
 
ధనస్సు : వస్త్ర, బంగారం, వెండి, గృహోపకరణ వ్యాపారులకు అన్ని విధాల కలిసిరాగలదు. ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. కష్టకాలంలో ఆత్మీయులు అండగా నిలుస్తారు. ఒక స్థిరాస్తి సమకూర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. అపరేషన్ల సమయంలో వైద్య రంగాల వారికి ఏకాగ్రత ముఖ్యం. 
 
మకరం : ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. స్త్రీలకు సంపాదన, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. సేవ, పుణ్య కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఆత్మీయుల గురించి ఆందోళన చెందుతారు. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ అధికారుల నుంచి అభ్యంరాలెదుర్కోవలసి వస్తుంది. 
 
కుంభం : స్వర్ణకారులు, బులియన్ వ్యాపారులకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాల్లో మార్పులుండవు. బంధువుల గురించి అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. ఫ్లీడర్లకు, తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. ఏ వ్యక్తికీ పూర్తి బాధ్యతలు అప్పగించడం మంచిదికాదు. 
 
మీనం : వాహనం నడుపుతున్నపుడు జాగ్రత్త అవసరం. ప్రతి పనిలోనూ ఉత్సాహం కనబరుస్తారు. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. మీ యత్నాలకు మీ శ్రీమతి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు దూర ప్రదేశాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి.