మేషం :- స్త్రీలు అన్ని రంగాలలో అభివృద్ధి, గౌరవం పొందుతారు. ఇతర దేశాలలో ఉన్న బంధు, మిత్రులను కలుసుకోగలుగుతారు. విద్యార్ధినిలు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలలో సఫలీకృతులవుతారు. పారిశ్రామిక రంగాలలో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. వస్త్ర, బంగారు, వెండి వ్యాపారస్థులకు శుభదాయకం. వృషభం :- మీ సంతానం కోసం ధనం విరివిగా ఖర్చు చేస్తారు. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగస్తులకు పదోన్నతి వంటి శుభ...