సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

07-01-2024 ఆదివారం దినఫలాలు-సూర్యస్తుతి ఆరాధించిన శుభం

horoscope
శ్రీ శోభకృత్ నామ సం||॥ మార్గశిర ఐ|| ఏకాదశి రా. 9.14 విశాఖ రా. 7.19 రా.వ.11.25 ల 1.03. సా.దు.4.07 ల 4.52. సూర్యస్తుతి ఆరాధించిన శుభం కలుగుతుంది.
 
మేషం :- రాజకీయనాయకులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. విద్యార్థుల క్రీడలపై ఆసక్తి చూపుతారు. వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబ విషయాల్లో చాలా ఆనందకమైన జీవనం సాగిస్తారు. 
 
వృషభం :- ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. పాత వస్తువులనుకొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
 
మిథునం :- కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ప్రముఖులను కలుసుకుంటారు. షాపుల అలంకరణ, కొత్త కొత్త స్కీములతో వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మీసంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
కర్కాటకం :- స్త్రీల అతి అలంకరణ విమర్శలకు దారితీస్తుంది. ఆలస్యమైనా పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. వాయిదా పడిన మొక్కుబడులు ఎట్టకేలకు తీర్చుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు పెట్టే యత్నాలు విరమించడం మంచిది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది.
 
సింహం :- ఉద్యోగస్తులు విశ్రాంతికైచేయు యత్నాలు ఫలిస్తాయి. హామీలు, అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. అందరితో కలిసివిందు, వినోదాలలో పాల్గొంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు విసుకుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు.
 
కన్య :- ఎటువంటి సమస్యనైనా ధీటుగా ఎదుర్కుంటారు. ఇతరుల స్థితిగతులతో పోల్చుకోవద్దు. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించండి. జూదాలు, వ్యసనాల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. కుటుంబీకుల అవసరాలు, కోరికలు నెరవేర్చగలుగుతారు. 
 
తుల :- నిరుద్యోగులకు ఉపాధిశిక్షణావకాశం లభిస్తుంది. మీ అభిరుచికి తగ్గ వ్యక్తులతో పరిచయా లేర్పడతాయి. ఊహించని ఖర్చులు, విద్యుత్ బిల్లులు, చెల్లింపులు ఆందోళన కలిగిస్తాయి. వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి మరింతగా శ్రమించాలి. ఆకర్షణీయమైన పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు.
 
వృశ్చికం :- మిత్రులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. హోటల్, స్టాక్ మార్కెట్ లాభాల దిశగాసాగుతుంది. రుణం తీసుకోవటం, ఇవ్వటం క్షేమం కాదని గమనించండి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి సమస్యలను ఎదుర్కొంటారు. పట్టుదలతో శ్రమించినగాని పనులు పూర్తి కావు. స్త్రీల ప్రతిభ వెలుగులోకి వస్తుంది.
 
ధనస్సు :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు ఆటుపోట్లు ఎదుర్కొనక తప్పవు. ముఖ్యమైన వ్యవహారాలు స్వయంగా చూసుకోండి. వాణిజ్య ఒప్పందాలు, చెల్లింపుల్లో ఏకాగ్రత ప్రధానం. ధన వ్యయంతోనే సమస్యలు సానుకూలమవుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది.
 
మకరం :- అధికారుల వేధింపులు, తనిఖీలు ఆందోళన కలిగిస్తాయి. ఉద్యోగస్తులు విశ్రాంతి పొందుతారు. ఖర్చులకు వెనుకాడకుండా ధనం బాగా వెచ్చిస్తారు. బంధువులు, అయిన వారి రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచటం మంచిది. విక్రయాలు బాగున్నా లాభాలు అంతంతమాత్రమే.
 
కుంభం :- దైవదర్శనాల్లో శ్రమ, ప్రయాసలు ఎదుర్కుంటారు. చేతివృత్తులు, చిరు వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. వ్యాపారాల్లో పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఇంట్లోనూ, సంఘంలో మీ మాటకు విలువ ఉండదు. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి.
 
మీనం :- మీ సంతానం భవిష్యత్తు కోసం నూతన పథకాలు చేపడతారు. వృత్తి, వ్యాపారాల వారికి అటంకాలు తొలగిపోతాయి. వసతి ఏర్పాట్ల విషయంలో చిక్కులు తొలగిపోతాయి. పందాలు, పోటీలలో జాగ్రత్త అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. ప్రేమికులు, విద్యార్థులు అతిగా వ్యవహరించటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది.