గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 6 జనవరి 2024 (18:02 IST)

07-01-2024 నుంచి 13-01-2024 వరకు మీ వార రాశిఫలాలు

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
 
కార్యం సిద్ధిస్తుంది. వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఉల్లాసంగా గడుపుతారు. ఆదివారం నాడు పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు సాగవు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిగా పనులు పూర్తి చేస్తారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. సన్నిహితులకు ముఖ్య సమాచారం అందిస్తారు. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఆహ్వాపం అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో రాణిస్తారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. అధికారులకు హోదా మార్పు. న్యాయవాదులకు ఆదాయాభివృద్ధి. పందాలు, క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1,2, పాదములు
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. మనస్సుకు నచ్చిన వ్యక్తులతో కాలక్షేపం చేయండి. వ్యాసకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు అనుకూలతలు నెలకొంటాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. సోమ, మంగళవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ప్రయాణంలో అవస్థలు తప్పవు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆహ్వానం అందుకుంటారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. బుధవారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎర్కుంటారు. మీపై శకునాల ప్రభావం అధికం. మనోధైర్యంతో వ్యవహరించండి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితుల వ్యాఖ్యలు ఉపశమనం కలిగిస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం సద్వినియోగం చేసుకోండి. అనవసర జోక్యం తగదు. ఉపాధ్యాయులకు పనిభారం. అధికారులకు అదనపు బాధ్యతలు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొత్త వ్యాపారాలు కలిసివస్తాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష 1, 2, 3, 4 పాదములు
కార్యసాధనకు పట్టుదల ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. మీ తప్పిదాలకు ఇతరులను నిందించవద్దు. ఆదాయం ఫర్వాలేదు అనిపిస్తుంది. ఖర్చులు భారమనిపించవు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. మంగళ, గురువారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. కొంతమంది తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సభలు, కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
 
 
సింహం 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
 
అందరితోను కలుపుగోలుగా మెలుగుతారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. డబ్బుకు లోటుండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సన్నిహితులను వేడుకలు, విందులకు ఆహ్వానిస్తారు. శుక్రవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీ చూడనట్లు వదిలేయండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి, వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
కార్యసిద్ధి, వాహనయోగం ఉన్నాయి. మీ సమర్థతపై ఎదుటివారికి గురి కుదురుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. కొత్త పనులు చేపడతారు. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహంలో సందడి నెలకొంటుంది. శనివారం నాడు ముఖ్యులు సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. మార్కెటింగ్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. ఆలయాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
సంకల్పం సిద్ధిస్తుంది. మానసికంగా స్థిమితపడతారు. బంధుత్వాలు బలపడతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు విపరీతం. గృహ అంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. సోమవారం నాడు ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఆహ్వానం అందుకుంటారు. సంతానానికి ఉద్యోగయోగం. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులు మన్ననలు అందుకుంటారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టసమయం. బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. మీ శ్రీమతి వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. ఆదాయం సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. మంగళ, బుధవారాల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. అధికారులకు హోదామార్పు. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. దూర ప్రయాణం చికాకుపరుస్తుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదము
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఖర్చులు అంచనాలను భిన్నంగా ఉంటాయి. రాబడిపై దృష్టి సారిస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. పనులకు ప్రణాళికలు రూపొందించుకుంటారు. గురువారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పెద్దల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. హోల్సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి, ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. సంతానానికి శుభయోగం. పోటీలు నిరుత్సాహపరుస్తాయి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఆలోచనలతో సతమతమవుతారు. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఖర్చులు అధికం. గృహావసరాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. శుక్ర, శనివారాల్లో పనులు ఒక పట్టాన సాగవు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. మీ శ్రీమతిలో ఆశించిన మార్పు వస్తుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. మీ అతిధ్యం ఆకట్టుకుంటుంది. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
ఈ వారం సంతోషదాయకం. కష్టం ఫలిస్తుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. మీ సాయంతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు పదోన్నతి, స్థానచలనం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిరువ్యాపారుల ఆదాయం బాగుంటుంది. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వాహనదారులకు దూకుడు తగదు. 
 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
లక్ష్యం నెరవేరుతుంది. ప్రతిభాపాటవాలు వెలుగుచూస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాచరాస్తుల కొనుగోలుపై దృష్టి సారిస్తారు. దళారులు, ఏజెన్సీలను విశ్వసించవద్దు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలందిస్తారు.