గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2023 (23:04 IST)

10-12-2023 నుంచి 16-12-2023 వరకు మీ వార రాశిఫలాలు

weekly horoscope
మేషం : అశ్వని, భరణి1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు. ఆదాయం బాగుంటుంది. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. మంగళవారం నాడు బంధుమిత్రుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకుంటారు. కీలక పత్రాలు అందుకుంటారు. సంతానం యత్నాలు ఫలిస్తాయి. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆటుపోట్లను అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు ఆకస్మిక స్థానచలనం. ఏజెంట్లు, రిప్రజెంటేటివ్‌ల లక్ష్యాలను సాధిస్తారు. ఆస్తి వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
మనోధైర్యంతో మెలగండి. అపజయాలకు కుంగిపోవద్దు. పరిచయస్తుల వ్యాఖ్యలు పట్టుదలను రేకెత్తిస్తాయి. ఓర్పుతో యత్నాలు సాగించండి. త్వరలో శుభవార్త వింటారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఆదివారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. పనులు మొండిగా పూర్తిచేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. బిల్డర్లకు కష్టసమయం. కార్మికులు, కూలీలకు పనులు లభిస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాల సందర్శన యత్నాలు సాగిస్తారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సోమ, మంగళవారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించి మెలగండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన ప్రధానం. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. నిరుద్యోగులకు శుభయోగం. ఉద్యోగస్తులకు పదవీయోగం. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష 1, 2, 3, 4 పాదములు
ఈ వారం అనుకూలదాయకమే. మీదైన రంగంలో రాణిస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. పనులు వేగవంతమవుతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
కార్యానుకూలత ఉంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. యత్నాలకు అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులు కలిసిరావు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. పనులు స్థిమితంగా పూర్తి చేస్తారు. బంధుత్వాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. సంతానం ధోరణి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. పాత పరిచయస్తులు తారసపడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ధనప్రలోభాలకు లొంగవద్దు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
సంప్రదింపులకు అనుకూలం. ఏకపక్ష నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. కొత్త పనులు చేపడతారు. బుధ, గురువారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. ఇతరులు మీ విషయాలకు దూరంగా ఉండి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్టర్లకు ఆదాయాభివృద్ధి. కార్మికులు, చేతివృత్తుల వారికి పనులు లభిస్తాయి.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
సంకల్పం సిద్ధిస్తుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. వస్త్రప్రాప్తి, వాహనయోగం ఉన్నాయి. పనుల సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. శుక్రవారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానం యత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యపరీక్షలు అవసరమవుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహార జయం, ధనలాభం ఉన్నాయి. ప్రణాళికలు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. సంస్థల స్థాపనలకు అనుకూల సమయం. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆప్తులకు ముఖ్యసమాచారం అందిస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. సంతానం దూకుడు అదుపు చేయండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఉద్యోగస్తులకు పనిభారం. సహోద్యోగులతో చికాకులెదురవుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల అలంకరణ ఆకట్టుకుంటుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదము
అనుకూలతలు అంతంత మాత్రమే. ఓర్పుతో మెలగాలి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. సోమ, మంగళ వారాల్లో చేసిన పనులే చేయవలసి వస్తుంది. మీపై శకునాల ప్రభావం అధికం. సన్నిహితుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. కీలక పత్రాలు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. మీ అలక్ష్యం వివాదాస్పదమవుతుంది. అధికారులకు అదనపు బాధ్యతలు, పనిభారం. ఆత్మీయులతో సంభాషిస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అతిగా ఆలోచింపవద్దు. సన్నిహితులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. బుధవారం నాడు బాధ్యతలు అప్పగించవద్దు. పనులు సాగక విసుగు చెందుతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. వృత్తుల వారికి సామాన్యం. ఉద్యోగస్తులకు పనిభారం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఆరోగ్యం కుదుటపడుతుంది. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు
అన్ని రంగాల వారికి యోగదాయకమే. మాట నిలబెట్టుకుంటారు. మీ నిజాయితీ ఆకట్టుకుంటుంది. పనులు వేగవంతమవుతాయి ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. మీ ఉన్నతిని చాటుకోవటానికి వ్యయం చేస్తారు. గురు, శుక్రవారాల్లో ఫోన్ సందేశాలను నమ్మవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ప్రలోభాలకు లొంగవద్దు. మీ శ్రీమతి లేక శ్రీవారికి అన్ని విషయాలు తెలియజేయండి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. వివాహయత్నం ఫలిస్తుంది. జాతక పొంతన ప్రధానం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు శుభయోగం. తీర్ధయాత్రలు, కొత్త ప్రదేశాలు సందరిస్తారు. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
వేడుకను ఆర్భాటంగా చేస్తారు. మీ ఉన్నతి బంధుమిత్రులకు అపోహ కలిగిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. శనివారం నాడు అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. సంస్థల స్థాపనలకు అనుకూలం. గృహమార్పు కలిసివస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు.