సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 11 నవంబరు 2023 (12:05 IST)

12-11-2023 నుంచి 18-11-2023 వరకు వార ఫలితాలు

weekly horoscope
మేషం : అశ్వని, భరణి1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
పరిస్థితులు మెరుగుపడతాయి. అవకాశాలను అనుకూలంగా మలుచుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అధికం. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఆదివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. సంతానం దూకుడు అదుపు చేయండి. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. నిశ్చితార్థంలో మెలకువ వహించండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. 
 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ధైర్యంగా యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. సంతానం కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. దంపతుల మధ్య అవగాహన లోపం. పట్టింపులకు పోవద్దు. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యపరీక్షలు అవసరం. అతిగా ఆలోచింపవద్దు. మంగళవారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. కార్మికులకు నిరాశాజనకం. వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
లక్ష్యాన్ని సాధిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగుచూస్తాయి. హామీలు నిలబెట్టుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. బాధ్యతగా మెలగాలి. పనులు వేగవంతమవుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. సంతానం దూకుడు అదుపుచేయండి. బుధ, గురు వారాల్లో ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆరోగ్యం సంతృప్తికరం. వివాహ యత్నాలు సాగిస్తారు. ఆశించిన సంబంధం కలిసిరాదు. ఇదీ ఒకందుకు మంచికేనని భావించండి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. నిరుద్యోగులకు ఓర్పు, కృషి ప్రధానం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. జూదాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు. 
 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష 1, 2, 3, 4 పాదములు
సంప్రదింపులకు తగిన సమయం. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. మీ అభ్యంతరాలను స్పష్టంగా తెలియజేయండి. సన్నిహితుల సలహా పాటించండి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికుం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. ఆహ్వానం అందుకుంటారు. వస్త్రప్రాప్తి, వాహనయోగం ఉన్నాయి. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. మీ చొరవతో ఒకరికి మేలు జరుగుతుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. పాతపరిచయస్తులతో సంభాషిస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధి ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. సరుకు నిల్వలో జాగ్రత్త. రిప్రజెంటేటివ్లకు ఒత్తిడి అధికం. వృత్తుల వారికి ఆశాజనకం. 
 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
గ్రహాల సంచారం అనుకూలిస్తుంది. మీ కష్టం వృధా కాదు. అవకాశాలను చేజిక్కించుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆదాయానికి మంచి ఖర్చులుంటాయి. చేతిలో ధనం నిలవదు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సందర్భానికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు. కీలక పత్రాలు అందుకుంటారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. యోగ, ధార్మిక విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది. వ్యాపారాల్లో పురోగతి, అనుభవం గడిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగస్తుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణం తగదు. 
 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
అన్ని రంగాల వారికీ బాగుంటుంది. వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహంలో సందడి నెలకొంటుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. శనివారం నాడు వాగ్వాదాలకు దిగవద్దు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను సమర్ధంగా ఎదుర్కుంటారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు, ధనప్రలోభాలకు లొంగవద్దు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
 
తుల: చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఊహించని ఖర్చులు, ధరలు చికాకుపరుస్తాయి. సోమవారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. మీపై శకునాల ప్రభావం అధికం. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. అయిన వారు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. సంతానం దూకుడు అదుపుచేయండి. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పనుల సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. గృహమార్పు అనివార్యం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. సేవ, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. వేడుకకు హాజరవుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. సాయం ఆశించవద్దు. మంగళ, బుధవారాల్లో అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. దంపతుల మధ్య అవగాహన లోపం. సన్నిహితుల కలయిక ఉత్తేజాన్నిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. నోటీసులు అందుకుంటారు. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో సంభాషిస్తారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. ఉద్యోస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. రిప్రజెంటేటివ్ లకు కష్టసమయం. అసాంఘిక కార్యకలాపాల జోలికిపోవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
ఈ వారం ఆశాజనకమే. వ్యవహారజయం, ధనలాభం ఉన్నాయి. హామీలు నిలబెట్టుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు ఆలస్యంగానైనా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. అయిన వారికి అన్ని విషయాలు తెలియజేయండి. ఆప్తుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. 
 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. మీ సిఫార్సుతో ఒకరికి మంచి జరుగుతుంది. అర్ధాంతంగా ఆగిన పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహంలో సందడి నెలకొంటుంది. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. అధికారులకు హోదామార్పు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. మాటతీరు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటుంది. దూర ప్రయాణం తలపెడతారు. 
 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆదాయం బాగుంటుంది. రుణబాధలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. గురువారం నాడు కొత్తవ్యక్తులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై దృష్టి సారిస్తారు. ఆప్తుల చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితాలిస్తాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధ్యాయులకు పనిభారం. ప్రముఖులకు వీడ్కోలు పలుకుతారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. శుక్ర, శని వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. ఆధ్యాత్మికతపై ఆసక్తి కలుగుతుంది. దైవకార్యాల్లో పాల్గొంటారు.