మేషం :- రాజకీయనాయకులు దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. ఆపద సమయంలో బంధు మిత్రులు అండగా నిలబడతారు. ఉపాధ్యాయులకు సంతృప్తి కావస్తుంది. హోటల్, క్యాటరింగ్ పనివారలకు అన్ని విధాలా కలిసిరాగలదు. వృషభం :- కీలకమైన విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయం మీ శ్రీమతికి నచ్చదు. మీపై ఆధారపడిన వారి పట్ల విజ్ఞతాయుతంగా మెలగండి. మిత్రుల గురించి ఆందోళన చెందుతారు....