సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

04-11-2023 శనివారం రాశిఫలాలు - ఈశ్వరునికి అభిషేకం చేయించి తీర్థం తీసుకున్నా శుభం...

horoscope
శ్రీ శోభకృత్ నామ సం|| ఆశ్వీయుజ బ|| సప్తమి రా.1.33 పునర్వసు ఉ.9.41 సా.వ.6.23 ల 8.07.
ఉ.దు. 6.03 ల 7.34.
 
ఈశ్వరునికి అభిషేకం చేయించి తీర్థం తీసుకున్నా శుభం కలుగుతుంది.
 
మేషం :- వృత్తుల వారికి ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఉద్యోగస్తులు అదనపు బరువు బాధ్యతలు స్వీకరిస్తారు. ఫ్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. అనుకున్నది సాధించేవరకు అవిశ్రాంతగా శ్రమిస్తారు. మీ బంధవులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. 
 
వృషభం :- ఆర్థిక పరిస్థితి ప్రోత్సహకరంగా ఉంటుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగాపూర్తి చేస్తారు. కుటుంబీకులతో దైవ దర్శనాలలో పాల్గొంటారు. స్త్రీలు పని దృష్ట్యా ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులు తోటివారి తప్పిదాల వల్ల అధికారులతో మాటపడవలసి వస్తుంది. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది.
 
మిథునం :- మీ మేథస్సుకి, వాక్చాతుర్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.
 
కర్కాటకం :- విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు తెలుసుకుంటారు. ప్రైవేటు సంస్థలలోని వారు ఓర్పు, అంకిత భావంతో పనిచేయటం క్షేమదాయకం. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. గృహనిర్మాణ పథకాలలో సంతృప్తి కానవస్తుంది. వైద్యులు శస్త్ర చికిత్స చేయునపుడు మెళకువ అవసరం. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
సింహం :- స్థిరాస్తిని అమ్మటానికి చేయుయత్నాలు ఫలిస్తాయి. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. ఏకాగ్రతతో కృషి చేసిన మీ ఆశయం తప్పకుండా నెరవేరుతుంది. మిత్రుల ప్రోత్సాహంతో దైవదీక్షలు స్వీకరిస్తారు. కోర్టు వ్యవహరాలు వాయిదా పడటంతో నిరుత్సాహం తప్పదు.
 
కన్య :- ముఖ్యుల్లో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. వ్యాపార వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. పత్రిక రంగాల్లోని వారికి చికాకులు అధికమవుతాయి. వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు అనుకూలం. ఉద్యోగస్తులు తరుచు సమావేశాలు, వేడుకలలో పాల్గొంటారు.
 
తుల :- రహస్య విరోధులు అధికం కావడంవల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. వాహనం విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. చేపట్టిన పనులు, మీ కార్యక్రమాల్లో మార్పులుంటాయి. కొత్త వ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు.
 
వృశ్చికం :- ఇంటా బయటా మీ ఆధిపత్యం కొనసాగుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటంతో నిరుత్సాహం చెందుతారు. శస్త్రచికిత్సలు విజయవంతం కావటంతో డాక్టర్లకు సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి వేధింపులు, పనివారలతో చికాకులు తప్పవు.
 
ధనస్సు :- స్త్రీలకు బంధు, మిత్రలలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విద్యార్థుల ప్రతిభకు, తెలివి తేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కిరణా, ఫ్యాన్సీ, పాన్, సుగంధ ద్రవ్య వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు.
 
మకరం :- కళ, క్రీడా, టెక్నికల్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. ఆహార వ్యవహారాల్లో, ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులతో మాటపడవలసి వస్తుంది. ఏదైనా స్థిరాస్తులు అమ్మకానికై చేయుయత్నాలు వాయిదా పడతాయి. సన్నిహితులతో కలిసి పలు కార్యమ్రాలలో పాల్గొంటారు.
 
కుంభం :- ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తారు. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత, మెళకువ అవసరం. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించినప్పటికి వాటిని సద్వినియోగం చేసుకో లేకపోతారు.
 
మీనం :- ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. నూతన వ్యక్తుల పరిచయం, వారితో సంభాషించేటపుడు చాలా జాగ్రత్త అవసరం. బంధు, మిత్రుల నుండి అందిన ఆహ్వానాలు మీకెంతో సంతృప్తినిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు.