1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

07-11-2023 మంగళవారం రాశిఫలాలు - కార్తీకేయుడిని తెల్లని పూజించినా మీ సంకల్పం...

Astrology
శ్రీ శోభకృత్ నామ సం|| ఆశ్వీయుజ బ॥ దశమి పూర్తి మఘ సా.4.44 రా.వ.1.36 ల 3.22.
ఉ.దు. 8. 19 ల 9.05 రా.దు. 10.28 ల 11.18.
 
కార్తీకేయుడిని తెల్లని పూజించినా మీ సంకల్పం సిద్ధిస్తుంది.
 
మేషం :- నిత్య, కంది, మినుము, నూనె వ్యాపారస్తులకు దిన దినాభివృద్ధి ఉంటుంది. రుణం ఏ కొంతైనా తీర్చ గలుగుతారు. సేవా కార్యక్రమాలలోనూ, భక్తి కార్యక్రమాలలోనూ చురుకుగా పాల్గొంటారు. ఎదుటివారిని ఆకట్టుకొనే ప్రయత్నంలో సఫలీకృతులవుతారు. కొత్త కొత్త పెట్టుబడులపట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
వృషభం :- స్త్రీలకు అనురాగ వాత్సల్యాలు పెంపొందుతారు. పాత మిత్రుల కలయిక మళ్ళీ మళ్ళీ జరగటం వల్ల మీలో ఎంతో ఉత్తేజాన్ని చేకూరుస్తుంది. కొత్త కొత్త వ్యాపారాలపట్ల ఏకాగ్రత వహిస్తారు. జీవితంలో చక్కని మలుపు మీకు తెలియకుండానే జరుతుంది. పొదుపు ఆవశ్యకతను గురించి తెలుసుకుంటారు.
 
మిథునం :- పండ్ల, పూల, కొబ్బరి వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం. కొన్ని అలవాట్లు మీకు ఎంతో చికాకును కలిగిస్తాయి. ఉన్నట్టుండి మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. విద్యార్థులకు కోపం తారాస్థాయికి చేకూరుతుంది. నియంత్రించుకోవడం వల్ల బంధు మిత్రులలో గుర్తింపు లభించగలదు.
 
కర్కాటకం :- ఆర్థిక ఇబ్బంది అంటూ లేక పోయినా పురోభివృద్ధి అంటూ ఏదీ ఉండదు. ఐరన్, సింమెంట్, కలప, ఇటుక వ్యాపారస్తులకు ఆశాజనకం. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు మీకు అనుకూలించగలవు. మీరు తెలివైన వ్యక్తులతో జాగ్రత్త వహించండి. మీలో ఆత్మాభిమానం అధికమవుతుంది.
 
సింహం :- మీ పెద్దల మూలకంగా మీ సమస్యలు జటిలమవుతాయి. మతపరమైన విషయాలు చర్చకు రాగలవు. వైద్యుల సలహా తప్పదు. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు. వస్త్ర, బంగారు, వెంటి, లోహ, పీచు వ్యాపారస్తులకు ఆశాజనకం. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు చేపట్టిన పనిలో అవరోధాలను ఎదుర్కొంటారు.
 
కన్య :- ప్రైవేటు రంగాల వారు మార్పుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. హోటల్, తినుబండారు వ్యాపారులకు, క్యాటరింగ్ రంగాలవారికి కలిసివచ్చే కాలం. ఉన్నట్టుండి మీలో వేధాంత ధోరణి అధికమవుతుంది. మిమ్మల్ని వేరే వ్యక్తుల కలియిక వల్ల సంతృప్తి కానవస్తుంది.
 
తుల :- మీలో నిరుత్సాహాన్ని పక్కన పెట్టి ధైర్య సాహసాలతో ముందుకుసాగి జయం పొందండి. ప్రభుత్వ రంగ సంస్థలలోని వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు మీకు మెండుగా లభిస్తాయి. ఇది సుఖపడే మార్గం అని రెడీమేడ్‌గా ఎక్కడా ఉండదు. మన మనస్సును బట్టి, మనలను బట్టి ఉంటుంది.
 
వృశ్చికం :- ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియలెస్టేట్ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండగలదు. సాంఘిక, సంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రుణం తీర్చాలి అనే ఆలోనను క్రియా రూపంలో పట్టండి. ఏ విషయంలోనూ ఊగిసలాట మంచిది కాదు అని గమనించండి. విద్యార్థులలో నూతన ఉత్తేజం కానవస్తుంది.
 
ధనస్సు :- గృహంలో మార్పులు, చేర్పులు మీకు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం మంచిది. యాజమాన్యానికి సంబంధించిన విషయాలలో మీ సలహా ఎంతో సహకరిస్తుంది. ఎలక్ట్రికల్, టెక్నికల్ రంగాలవారికి కలిసివచ్చే కాలం. చిన్న చిన్న ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి.
 
మకరం :- నిత్యవసర వస్తు స్టాకిస్టులకు, మిర్చి, నూనె వ్యపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. దైవ సన్నిధిలో గడపగలుగుతారు. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. తాపి పనివారికి, చేతి పనివారికి కలిసివచ్చే కాలం. గతం కంటే ఇప్పుడు చాలా మెరుగుగా ఉంటుంది.
 
కుంభం :- ధనం బాగుగా వెచ్చిస్తారు. మీ కలలు సాఫల్యమయ్యే కాలం ఆసన్నమైనది అని గమనించండి. పీచు, లెదర్, హోమ్ వ్యాపారస్తులకు సంతృప్తి, అభివృద్ధి కానవస్తుంది. తోటివారితో అనుబంధాలు బలపడతాయి. సోదరీ, సోదరుల భావం అధికమవుతుంది. వ్యవసాయ తోటల రంగాలలోని వారికి కలిసివచ్చే కాలం.
 
మీనం :- మీ సృజనాత్మక శక్తికి, తెలివి తేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. కిరణా, ఫ్యాన్సీ, మందులు, రసాయనిక ద్రవ్య వ్యాపారస్తులకు, మిర్చి, కంది స్టాకిస్టులకు పురోభివృద్ధి ఉండగలదు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. మార్పుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.