శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

05-11-2023 ఆదివారం రాశిఫలాలు - సూర్యుని ఆరాధించిన ఆర్ధికాభివృద్ధి...

daily horoscope
శ్రీ శోభకృత్ నామ సం|| ఆశ్వీయుజ బి|| అష్టమి తె.3.18 పుష్యమి ఉ.11.46 రా.వ.1.50 ల 3.35. సా.దు. 3.54 ల 4.39.

సూర్యుని ఆరాధించిన ఆర్ధికాభివృద్ధి, పూరోభివృద్ధి కానవస్తుంది.
 
మేషం :- ఆర్ధిక లావాదేవీల్లో ఒత్తిడి, హడావిడి అధికంగా ఉంటాయి. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయద్దు. వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో సఫలీకృతులవుతారు. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. రాబోయే ధనానికి ముందుగానే ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. నిరుద్యోగులకు రాత, మౌఖికపరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. 
 
వృషభం :- స్త్రీలు దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అందరిని ఆకట్టుకుంటారు. మొండి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాస లెదుర్కుంటారు. సంఘంలో మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల ఏకాగ్రత చాలా అవసరం. పెద్దల ఆరోగ్య విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. 
 
మిథునం :- రాజకీయ నాయకులు సభలు, సమావేశాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రులు మీతో కలిసి విందులలో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు అనవసర ప్రసంగాలు అపార్థాలకు దారితీస్తాయి మెళకువ అవసరం.
 
కర్కాటకం :- చిన్నారులకు బహుమతులు అందజేస్తారు. మీ శ్రీమతి మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉద్యోగ రీత్యా దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. రాజకీయాలలో వారికిస్నేహ బృందాలు అధికమవుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
 
సింహం :- వృత్తి, వ్యాపారలపై దృష్టి సాగిస్తారు. ప్రముఖుల సహకారంతో లక్ష్యాలను సాధిస్తారు. విందు, వినోదాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. బంధువుల రాకతో ఖర్చులు అధికం. ప్రింటింగ్ రంగాల వారు అక్షర దోషాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. రాజకీయ, సినీరంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు.
 
కన్య :- ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. కుటుంబీకులతో కలసి ఆలయాలను, నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. విద్యార్థులు క్రీడా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం.
 
తుల :- ఆర్థికపరమైన చర్చలు, ప్రయాణాలకు అనుకూలం. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలను సాధిస్తారు. మీ సంతానం అతిగా వ్యవహరించటం వల్ల మాటపడక తప్పదు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. హాస్టళ్ళ సందర్శన, విహార యాత్రలు అనుకూలిస్తాయి. సన్నిహితుల ఆరోగ్యం కొంత కలవరపెడుతుంది.
 
వృశ్చికం :- శ్రీవారు, శ్రీమతి వైఖరి చికాకు కలిగిస్తుంది. వస్తువుల కొనుగోళ్ళలో నాణ్యతను గుర్తించాలి. అవసరమైన నిధులు సర్ధుబాటవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. చిన్నారుల విషయంలో శుభప్రదం. స్త్రీలకు అకాల భోజనం వల్ల ఆరోగ్యములో చికాకులు తలెత్తుతాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది.
 
ధనస్సు :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. గృహనిర్మాణ రంగాల వారు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. వన సమారాధనలు, వేడుకలకు ప్రణాళికలు రూపొందిస్తారు. ఇంటర్వ్యూల్లో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. మనసును ఏదో వెలితి బాదిస్తుంది. విదేశీ వ్యవహారాలకు ఆటంకం కలుగుతుంది.
 
మకరం :- స్త్రీలు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. సినీ రంగాలవారికికొంత అసౌకర్యం కలుగుతుంది. క్రయ విక్రయాలలో నాణ్యత గమనించాలి. బంధు మిత్రులతో వేడుకలు, విందుల్లో పాల్గొంటారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. కుటుంబ సభ్యుల వైఖరిలో మార్పు ఆవేదన కలిగిస్తుంది.
 
కుంభం :- చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా వేడుకల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. వాహనం కొనాలనే ఆలోచన క్రియారూపంలో పెట్టండి. మీ వాగ్ధాటితో ఎదుటి వారిని మెప్పిస్తారు. పెట్టుబడులలో నిదానం అవసరం. సమావేశాలు, బృంద కార్యక్రమాలు, వేడుకల్లో పాల్గొంటారు.
 
మీనం :- వృత్తి వ్యాపారాల్లో కొత్త ప్రయోగాలకు తగిన సమయం కాదు. షాపింగ్ వస్తువుల నాణ్యతను గమనించండి. మీ గౌరవ మర్యాదలకు భంగం కలిగే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. మార్కెటింగ్, రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. రాజకీయనాయకులకు సమావేశాలలో అసౌకర్యం కలిగి అవకాశంఉంది.