1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

11-11-2023 శనివారం రాశిఫలాలు - అభయ ఆంజనేయస్వామిని పూజించిన మనోసిద్ధి..

Weekly astrology
శ్రీ శోభకృత్ నామ సంII ఆశ్వీయుజ ఐ| త్రయోదశి ప.12.48 చిత్త రా.1.42 ఉ.వ.8.31 ల 10.14. ఉ. దు. 6.03 ల 7.34.
 
అభయ ఆంజనేయస్వామిని పూజించిన మనోసిద్ధి, సంకల్పసిద్ధి చేకూరుతుంది.
 
మేషం :- బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులు పెద్ద మొత్తంలో చెక్కులు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ సంతానం విద్య, వివాహ విషయాల పట్ల దృష్టి సారిస్తారు. మీ బంధువుల కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు.
 
వృషభం :- బంధువులతో స్పర్థలు, పట్టింపులు ఎదుర్కుంటారు. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలను ఎదుర్కొంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. కుటుంబ సమస్యలు, ఏ యత్నం కలిసిరాక మనస్సు ఆందోళనకు గురవుతుంది.
 
మిథునం :- మీ సంతానం ప్రేమ విషయం చర్చనీయాంశమవుతుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే ఆస్కారం ఉంది. వైద్య రంగాల వారు అరుదైన శస్త్రచికిత్సలను సమర్థంగా నిర్వహిస్తారు. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు.
 
కర్కాటకం :- పట్టుదలతో శ్రమించి అసాధ్యనమనుకున్న దానిని సాధిస్తారు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుకోవటంతో పాటు అనుభం, లాభాలు గడిస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి.
 
సింహం :- మీ జీవితభాగస్వామికి అన్ని విషయాలు తెలియజేయటం మంచిది. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. స్త్రీలకు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంకూడదు. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది.
 
కన్య :- ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ముఖ్యం. స్త్రీలకు నరాలు, దంతాలు, కళ్లకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత, పునఃపరిశీలన ముఖ్యం. వాహనం, విలువైన వస్తువులు మరమ్మతులకు గురయ్యే అస్కారం ఉంది.
 
తుల :- రాబోయే ఆదాయానికి తగినట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. స్త్రీలకు దూర ప్రయాణాలలో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి, పనిభారం తగ్గుతాయి. మీకందిన చెక్కులు చెల్లక ఇబ్బంది పడతారు. స్థిరాస్తుల విక్రయంలో పునరాలోచన అవసరం.
 
వృశ్చికం :- వృత్తి వ్యాపారాల్లో అనుభవం, లాభాలు గడిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. స్త్రీలకు ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. పెద్ద మొత్తలో చెక్కుల జారీలో జాగ్రత్త. ఉద్యోగయత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు.
 
ధనస్సు :- ఆర్థికస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మిమ్ములను పొగిడిన వారే విమర్శించేందుకు వెనుకాడరు. రేషన్ డీలర్లకు అధికారుల నుంచి ఇబ్బందులెదురవుతాయి. బ్యాంకు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమాస్తాలకు చికాకులు తప్పవు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
మకరం :- మీ అభిరుచి, ఆశయాలకు సంబంధించిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. క్యాటరింగ్ పనివారలకు ఆశాజనకం. ఇతరుల సలహా పాటించటం కంటే సొంత నిర్ణయమే మేలు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం కావడంతో శ్రమాధిక్యత తప్పదు. బంధువుల నుంచి విమర్శలు, ఆక్షేపణలు ఎదురవుతాయి.
 
కుంభం :- చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. విలేఖరులకు, ఎలక్ట్రానిక్ మీడియా రంగాల వారికి చికాకులను ఎదుర్కొంటారు. అధికారులు ధనప్రలోభాలకు దూరంగా ఉండటం ఉత్తమం. గృహంలో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలెడుతలారు. ప్రేమికుల అనాలోచిత నిర్ణయాలు అనర్థాలకు దారితీస్తాయి.
 
మీనం :- స్త్రీలకు ఆభరణాలు, విలువైన వస్తువుల కొనుగోలులో ఏకాగ్రత ముఖ్యం. ఆడంబరాలు, భేషజాలకు పోవద్దు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ వ్యాపారులకు కలిసిరాగలదు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకుని ఇబ్బందులెదుర్కుంటారు. మీ సంతానం ప్రేమ వ్యవహారం చర్చనీయాంసమవుతుంది.