శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 25 నవంబరు 2023 (21:34 IST)

26-11-2023 నుంచి 02-12-2023 వరకు వార ఫలితాలు

Weekly astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
ఈ వారం ఆశాజనకమే. కార్యం సిద్ధిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. పరిచయాలు బలపడతాయి. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆరోగ్యం జాగ్రత్త. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు మార్పులు కలిసివస్తాం. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను అధిగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
అనుకూలతలు అంతంతమాత్రమే. వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. ఏకపక్ష నిర్ణయాలు తగవు. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. పనులు అర్థాంతంగా ముగించవవలసి వస్తుంది. దంపతుల మధ్య అకారణ కలహం. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. పాతమిత్రులు తారసపడతారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు, దళారులను ఆశ్రయించవద్దు. నిరుద్యోగులకు శుభయోగం. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
ముఖ్యమైన కార్యాల్లో విజయం సాధిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపకాలు, బాధ్యతలు అధికమవుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సోమవారం నాడు వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు, మొహమ్మాటాలకు లొంగవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాతవ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. అవివాహితులకు శుభయోగం. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు
ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు సామాన్యం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. కొత్త పరిచయాలేర్పడతాయి. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. మంగళ, బుధ వారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆప్తులకు వివాహ సమాచారం అందిస్తారు. సంతానం యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. అధికారులకు కొత్త బాధ్యతలు, పనిభారం. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
సింహం: మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
లక్ష్యం నెరవేరుతుంది. పురస్కారాలు అందుకుంటారు. ఖర్చులు విపరీతం. గృహాలంకరణల పట్ల ఆసక్తి కలుగుతుంది. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. సంస్థల స్థాపనకు అనుకూలం. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. గురువారం నాడు అనుకోని సంఘటనలెదురవుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సాయం ఆశించవద్దు. పాతమిత్రులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపు పనివారలతో జాగ్రత్త. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతిలోపం. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
అన్ని రంగాల వారికీ బాగుంటుంది. ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకుంటారు. మీ నమ్మకం ఫలిస్తుంది. సంప్రదింపులకు అనుకూలం. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా తెలియజేయండి. ఆదివారం నాడు ఆప్తుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపు ధనాన్ని ముందుగానే గ్రహిస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. వివాహయత్నం ఫలిస్తుంది. కల్యాణ వేదికలు అన్వేషిస్తారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. పనులు ఆలస్యంగానైనా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. టెండర్లు, కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. చిరువ్యాపారులకు ఆశాజనకం.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. సాయం అర్ధించేందుకు వెనుకాడదు. మీ శ్రీమతి ప్రోద్భలంతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఖర్చులు విపరీతం. చెల్లింపులు, అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. సోమ, మంగళ వారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. బిల్డర్లకు కష్టసమయం. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కుటుంబీకులు ప్రోత్సాహం ఉంటుంది. మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. బుధవారం నాడు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదామార్పు. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
ప్రతికూలతలు తొలగుతాయి. ధైర్యంగా అడుగులేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆదాయం సంతృప్తికరం. రుణ ఖర్చులు అధికం. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. గురు, శుక్ర వారాల్లో ఫోన్ సందేశాలు, ప్రకటనలను నమ్మవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అవివాహితులకు శుభయోగం. కీలక పత్రాలు అందుకుంటారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు ఆస్కారం లేదు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలు చేజారిపోతాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. పట్టుదలతో మెలగండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. పత్రాల్లో మార్పుచేర్పులకు అనుకూలం. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు ప్రశాంతంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు అదనపు బాధ్యతలు. సభలు, కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
వ్యవహారానుకూలత ఉంది. వాగ్ధాటితో రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు, వ్యాపకాలు అధికమవుతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి ఆది, సోమ వారాల్లో నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంభాషిస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు, పనిభారం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. ఆదాయం సంతృప్తికరం. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పెట్టుబడులు కలిసిరావు. అర్ధాంతంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. దాంపత్యసౌఖ్యం, ప్రశాంత పొందుతారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. బుధవారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. రిప్రజెంటేటివ్ లకు ఒత్తిడి అధికం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. ధార్మికత పెంపొందుతుంది. ఆలయాలు, సేవాసంస్థలకు విరాళాలు అందిస్తారు.