గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 అక్టోబరు 2023 (13:01 IST)

29-10-2023 నుంచి 04.11.2023 వరకు మీ వార రాశిఫలాలు

weekly horoscope
మేషం : అశ్వని, భరణి1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆత్మవిశ్వాసంతో యత్నాలు సాగించండి. సహాయం ఆశించవద్దు. మీ సమర్ధతపై నమ్మకం పెంచుకోండి రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. ఆప్తులతో సంభాషిస్తారు. శనివారం నాడు నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. బాధ్యతలు అప్పగించి ఇబ్బందులెదుర్కుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పాతపరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన బలపడుతుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు కష్టసమయం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
వ్యవహారాలతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆది, సోమవారాల్లో ఆకస్మిక ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. కొత్త పనులకు శ్రీకారంచుడతారు. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. గృహమార్పు కలిసివస్తుంది. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆప్తుల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. కాంట్రాక్టర్లకు కష్టసమయం. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
మనోధైర్యంతో వ్యవహరిస్తారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. మంగళవారం నాడు ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. కొంతమంది రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు హడావుడిగా సాగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యపరీక్షలు అవసరం. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. గృహమార్పు కలిసివస్తుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగస్తులు ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. సేవ, సాంకేతిక రంగాల వారికి నిరాశాజనకం. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష 1, 2, 3, 4 పాదములు
సత్కాలం సమీపిస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. విమర్శలు, అభియోగాలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. గురువారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. ఆత్మీయుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్యికత పెంపొందుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన కార్యక్రమాలపై దృష్టి పెడతారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. లక్ష్య సాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. మంగళ, బుధవారాలో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాదనలకు దిగవద్దు. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. గృహమార్పు అనివార్యం. సంతానం యత్నాలు ఫలిస్తాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. పాతమిత్రుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. పెట్టుబడుల పట్ల ఆకర్షితులవుతారు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
ఈ వారం అన్ని రంగాల వారికీ అనుకూలమే. వేడుకకు హాజరవుతారు. బంధుమిత్రులతో సంబంధాలు బలపడతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. పనులు సజావుగా సాగుతాయి. అయిన వారి ఆరోగ్యం కుదుటపడుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. సలహాలు, సహాయం ఆశించవద్దు. ఇంటి విషయాలు గోప్యంగా ఉంచండి. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. సొంత వ్యాపారాలే కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు పురస్కారయోగం. సాంకేతిక రంగాల వారికి సామాన్యం. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. మీ శ్రీమతికి ప్రతి విషయం తెలియజేయండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలపడదు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. హోల్‌సేల్ వ్యాపారాలకు వేధింపులు అధికం. సభలు, కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
పరిస్థితుల అనుకూలత అంతంత మాత్రమే. శ్రమించినా ఫలితం ఉండదు. పట్టుదలతో యత్నాలు సాగించండి. మిమ్ములను తక్కువ అంచనా వేసుకోవద్దు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. నిస్తేజానికి లోనవుతారు. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. మనస్సుకు నచ్చిన వ్యక్తులతో కాలక్షేపం చేయండి. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. మంగళవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆందోళన తగ్గికు కుదుటపడతారు. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. అధికారులను ఆకట్టుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ప్రయాణం సజావుగా సాగుతుంది.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
సంతోషకరమైన వార్తలు వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. రావలసిన ఆదాయం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు ప్రయోజనకరం. సంస్థల స్థాపనలకు తగిన సమయం. కొత్త పరిచయాలేర్పడతాయి. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. దాంపత్యసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. బుధ, గురు వారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాతవ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. వేడుకకు హాజరవుతారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. ప్రతి విషయంలోను మీ ఆధిక్యత కొనసాగుతుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. శుక్రవారం నాడు చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పును గమనిస్తారు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం యత్నాలు ఫలిస్తాయి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
పరిస్థితులు మెరుగుపడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. అంచనాలనాలు ఫలిస్తాయి. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఆదివారం నాడు నగదు, పత్రాలు జాగ్రత్త. ఆప్తుల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. విందులకు హాజరవుతారు. బంధుత్వాలు బలపడతాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. పట్టుదలతో యత్నాలు సాగించండి. కష్టసమయంలో సన్నిహితులు ఆదుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ధైర్యంగా ముందుకు సాగండి. శకునాలను పట్టించుకోవద్దు. సోమవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.